Naga Susheela : అక్కినేని నాగార్జున సోదరి పై పోలీస్ కేసు.. హీరో సుశాంత్‌కి..
నాగార్జున సోదరి, హీరో సుశాంత్ తల్లి నాగసుశీల పై పలు సెక్షన్స్ కింద మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
- gum 95921
- Published On : September 18, 2023 / 05:34 PM IST
police case filed on Nagarjuna sister Sushanth mother Naga Susheela
Naga Susheela : అక్కినేని నాగేశ్వరరావుకి నాగార్జునతో (Nagarjuna) పాటు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు నాగ సుశీల. ఈమె తనయుడే టాలీవుడ్ హీరో సుశాంత్. తాజాగా ఈమె పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. భూమి వ్యవహారం గొడవ నేపథ్యంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్స్ కింద కేసు నమోదు అయ్యినట్లు సమాచారం. చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. నాగ సుశీల, చింతలపూడి శ్రీనివాస్ ఇద్దరు కలిసి ‘శ్రీ నాగ్ ప్రొడక్షన్స్’ బ్యానర్ ని స్థాపించారు.
Varun Tej – Lavanya Tripathi : పెళ్ళికి ముందే అత్తారింటిలో లావణ్య త్రిపాఠి పండగ వేడుక..
ఈ ప్రొడక్షన్ లో కాళిదాసు, కరెంట్, అడ్డా, ఆటాడుకుందాంరా వంటి సినిమాలను కలిసి నిర్మించారు. అయితే కొన్నాళ్ల క్రితం వీరిద్దరి మధ్య విబేధాలు రావడం జరిగింది. అప్పటి నుంచి ఏదొక విషయంలో ఒకరి పై ఒకరు పోలీస్ స్టేషన్ లో పరస్పర పిర్యాదులు చేసుకుంటూ వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక తాజాగా ఒక భూమి వ్యవహారం గొడవ గురించి శ్రీనివాస్ పిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ పిర్యాదులో తనపై నాగసుశీలతో పాటు మరో 12 మంది కలిసి దాడి చేసినట్లు శ్రీనివాస్ పేర్కొన్నట్లు సమాచారం.
Bigg Boss 7 : నామినేషన్స్ రచ్చ మొదలు.. దామిని, ప్రిన్స్ యావర్ ల మధ్య మాటల యుద్ధం..
సినిమా నిర్మాణంతో పాటు పలు వ్యాపార రంగాల్లో కూడా భాగస్వాములుగా ఉన్నారని తెలుస్తుంది. అయితే నాగసుశీలకు తెలియకుండా శ్రీనివాస్ ఒక భూమిని విక్రయించారని ఆమె గతంలో పోలీసులకు పిర్యాదు చేసినట్లు సమాచారం. తనని జైలుపాలు చేసి తన కంపెనీ ఆస్తులను సొంతం చేసుకోవడానికే నాగసుశీల తన పై కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు విషయం హాట్ టాపిక్ గా మారింది.
