Urfi Javed : బిగ్‌బాస్ నటిపై నమోదైన పోలీస్ కేసు..
ఇండియన్ నెంబర్ వన్ టెలివిజన్ రియాలిటీ గేమ్ షో బిగ్‌బాస్‌లో చోటు దక్కించుకుని ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంటున్నారు కొంతమంది సోషల్ పర్సన్స్. అలా ఒక్కసారిగా వచ్చిన ఫేమ్ ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక కొంతమంది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే...
- gum 95921
- Published On : December 12, 2022 / 08:26 PM IST
Police case registered against Bigg Boss actress
Urfi Javed : ఇండియన్ నెంబర్ వన్ టెలివిజన్ రియాలిటీ గేమ్ షో బిగ్‌బాస్‌లో చోటు దక్కించుకుని ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంటున్నారు కొంతమంది సోషల్ పర్సన్స్. అలా ఒక్కసారిగా వచ్చిన ఫేమ్ ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక కొంతమంది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే హిందీ బిగ్‌బాస్‌కి ఎంట్రీ ఇచ్చి యూత్ లో ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్న భామ ‘ఉర్ఫి జావెద్’.
Urfi Javed : తన డ్రెస్సింగ్ స్టైల్‌తో రచ్చ చేస్తున్న నటి.. ఫైర్ అవుతున్న నెటిజెన్లు..
ఈమె హిందీ టెలివిజన్ రంగంలో పనిచేస్తుంటుంది. అయితే సీరియల్స్ లో తన నటనకు తెచ్చుకున్న గుర్తింపు కన్నా, సోషల్ మీడియాలో బోల్డ్ పోస్ట్ లు పెట్టి వివాదాస్పద రీతిలో చాలా గుర్తింపునే సంపాదించుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ లో నిత్యం బోల్డ్ కంటెంట్ ఫొటోస్ అండ్ వీడియోస్ పెడుతూ యూత్‌లో ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.
అయితే ఈ అమ్మడి వేషాలు మరి మితిమీరి పోవడంతో.. ముంబై అందేరిలోని ‘అలీ కషిఫ్ ఖాన్ దేశముఖ్’ అనే న్యాయవాది పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశాడు. ఈ బోల్డ్ బ్యూటీ అసభ్యకర వేషాలు సోషల్ మీడియా నుంచి బహిరంగ ప్రదేశాలకు కూడా చేరడంతో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటీవల ప్రముఖ రచయిత అయిన చేతన్ భగత్ పైన కూడా విమర్శలు చేసి హాట్ టాపిక్ గా మారింది ఈ భామ.
