Pooja Hegde : హమ్మయ్య.. పూజాహెగ్డేకి సినిమా ఛాన్సులు వస్తున్నాయి.. బాలీవుడ్‌లో బిజీ కాబోతున్న బుట్టబొమ్మ..

తాజాగా పూజా హెగ్డేకి ఒకేసారి బాలీవుడ్ లో మూడు ఆఫర్లు వచ్చినట్టు సమాచారం.

Pooja Hegde Getting Bollywood Offers after Gap she Busy with Movies

Pooja Hegde : ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పూజా హెగ్డే ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయి స్టార్ హీరోల సరసన చేసింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలవైకుంఠపురంలో సినిమాతో నేషనల్ వైడ్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న సమయంలో అందరు హీరోయిన్స్ లాగే బాలీవుడ్ కి చెక్కేసింది.

ఆల్రెడీ బాలీవుడ్ లో ఒక సినిమా చేసి అక్కడి నుంచే వచ్చిన ఈ బుట్టబొమ్మ మళ్ళీ అక్కడికి వెళ్లి రెండు సినిమాలు చేయగా అవి కాస్తా ఫ్లాప్ అయింది. బాలీవుడ్ లో తెగ అవకాశాలు వచ్చేస్తాయని, డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదని మహేష్ బాబు గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా వదిలేసుకొని మరీ వెళ్లిందని సమాచారం. దీంతో బాలీవుడ్ అవకాశాల కోసం సౌత్ సినిమాలని వదిలేసుకుందని పూజాహెగ్డేపై విమర్శలు కూడా వచ్చాయి.

తీరా అక్కడికి వెళ్ళాక పరిస్థితి అంతా మారిపోయింది. సల్మాన్ తో చేసిన సినిమా రిలీజయిన దగ్గర్నుంచి అమ్మడికి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఇటు టాలీవుడ్ లో కూడా ఎవ్వరూ పిలవలేదు. ఆఖరికి వెబ్ సిరీస్ లు కూడా చేద్దామని ఫిక్స్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. చేతిలో సినిమాలేమి లేకుండా ఒక సంవత్సరం గడిపేసింది పూజా. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Also Read : Surabhi : జస్ట్ మిస్ చనిపోయేదాన్ని.. మేమంతా బతికాం.. హీరోయిన్ పోస్ట్ వైరల్..

తాజాగా పూజా హెగ్డేకి ఒకేసారి బాలీవుడ్ లో మూడు ఆఫర్లు వచ్చినట్టు సమాచారం. షాహిద్ కపూర్ తో దేవా అనే సినిమాలో నటిస్తుంది పూజ హెగ్డే. ఈ సినిమా దసరాకి రిలీజ్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూట్ జరుగుతుంది. దీని తర్వాత బాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న కార్తీక్ ఆర్యన్ తో ఒక సినిమా ఓకే అయిందని సమాచారం. అలాగే అహాన్ శెట్టి సరసన ఒక సినిమా ఓకే చేసింది. ఈ సినిమా వచ్చే సంవత్సరం వాలెంటైన్స్ డేకి వస్తుందని తెలుస్తుంది. దీంతో పూజా చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి. పూజా హెగ్డే మళ్ళీ గతంలో లాగా బిజీ అవ్వాలని అభిమానులు భావిస్తున్నారు. మరి ఇకపై బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తుందా, టాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తాయా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు