Pooja Hegde Birthday: ఇండస్ట్రీ ఏదైనా బుట్ట బొమ్మ ఉండాల్సిందే..!
పూజా హెగ్డే ఏ ముహూర్తాన టాలీవుడ్ లో హిట్ కొట్టిందో కానీ .. ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతోంది. కెరీర్ స్టార్ట్ చేసిన షాట్ టైమ్ లో..
- Naresh Mannam
- Published On : October 13, 2021 / 01:29 PM IST
Pooja Hegde
Pooja Hegde: పూజా హెగ్డే ఏ ముహూర్తాన టాలీవుడ్ లో హిట్ కొట్టిందో కానీ .. ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతోంది. కెరీర్ స్టార్ట్ చేసిన షాట్ టైమ్ లో ఓన్లీ స్టార్ హీరోలతోనే నటించే ఛాన్స్ దక్కించుకుంటున్న పూజాహెగ్డే ..ప్రజెంట్ ఏ హీరోయిన్ కీ లేనన్ని సినిమాలతో ఇటు సౌత్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా రికార్డ్ క్రియేట్ చేస్తోంది.
Pushpa: శ్రీవల్లి సాంగ్.. మరోసారి యూట్యూబ్‌లో పుష్ప మేనియా!
కమిట్ మెంట్ తో పనిచేస్తే కెరీర్ ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో అన్నదానికి కేరాఫ్ అడ్రస్ పూజాహెగ్డే. తెలుగులో ఫస్ట్ చేసిన ఒక లైలా కోసం అంతగా సక్సెస్ అవ్వకపోయినా.. డిసప్పాయింట్ అవ్వకుండా మరింత కమిటెడ్ గా కష్టపడ్డ పూజా.. ఇప్పుడు కనీసం బ్రేక్ తీసుకోడానికి కూడా వీలులేకుండా అప్ కమింగ్ స్టార్ అఖిల్ దగ్గరనుంచి ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరకూ స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
Samantha: సామ్ బాలీవుడ్ ప్లాన్స్.. త్వరలోనే గుడ్ న్యూస్!
ప్రజెంట్ పూజా అకౌంట్ లో ఉన్న వన్నీ స్టార్ హీరోల సినిమాలే. జనరల్ గా హీరోయిన్స్ ని పెద్దగా రిపీట్ చెయ్యని మన స్టార్ హీరోలు కూడా.. పూజానే కావాలంటున్నారు. తమ లక్కీ ఛామ్ హీరోయిన్ గా సినిమాకి మేజర్ ఎసెట్ గా పూజాకే ఓటేస్తున్నారు మేకర్స్. తెలుగు నుంచి బాలీవుడ్ వరకూ పూజాకి ఛాన్స్ ఇస్తున్న వాళ్లందరూ స్టార్ హీరోలే. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో చేస్తూ.. తమిళ్ లో బీస్ట్ లో విజయ్ కి జంటగా నటిస్తూ.. మరో వైపు మహేష్ బాబుతో రెండోసారి యాక్ట్ చెయ్యడానికి రెడీ అవుతోంది పూజా.
Sony Charishta: చూపులతోనే మత్తు జల్లేస్తున్న నేపాలీ బ్యూటీ
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్…ఇండస్ట్రీ ఏదైనా బంపర్ ఆఫర్స్ ను కొట్టేసి స్టార్ డం ను ఎంజాయ్ చేస్తోంది పూజా. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో.. మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ లాంటి టాప్ హీరోలందరితో బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలు చేసేస్తోంది. అంతేకాదు వీళ్లతో రెండోసారి, మూడోసారి రిపీట్ కూడా చేస్తోంది. ఇప్పుడు హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సాంగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ దక్కించుకున్న బుట్టబొమ్మ.. ఒక పక్క తెలుగు సినిమాలతో పాటు, తమిళ్, హిందీ సినిమాలతో కెరీర్ బెస్ట్ టైమ్ ని ఎంజాయ్ చేస్తోంది. నేడు పూజ పుట్టినరోజు కాగా.. అమ్మడు నటించే సినిమాల మేకర్స్ నుండి శుభాకాంక్షలు కూడా అదే స్థాయిలో వచ్చాయి.
.@manojdft #RRaveendar @mithoon11 @tanishkbagchi @AmaalMallik @tuneintomanan @manojmuntashir @kumaarofficial #RashmiVirag #KotagiriVenkateswarRao @resulp @justin_tunes @VMVMVMVMVM pic.twitter.com/BZLwStESaw
— UV Creations (@UV_Creations) October 13, 2021
Here's wishing the stunning & extremely talented 'VIBHA' aka @hegdepooja a very happy birthday – Team #MostEligibleBachelor #HBDPoojaHegde#AlluAravind @AkhilAkkineni8 @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #VasuVarma #BunnyVas @GA2Official @adityamusic #MEBOnOct15th pic.twitter.com/5P6Lo4KvyG
— Geetha Arts (@GeethaArts) October 13, 2021
