Pooja Hegde : ‘రాధేశ్యామ్’ రిజల్ట్ ఎలా ఉన్నా.. అంటూ పూజాహెగ్డే ట్వీట్
అయితే సినిమా గురించి పూజా హెగ్డే ట్వీట్ చేసింది. తన అసిస్టెంట్స్ తో ఉన్న ఫోటో షేర్ చేసి ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేసింది పూజా హెగ్డే. ఆ ఫోటోని షేర్ చేస్తూ.. ''ఈ ఫొటోలో ఉన్న మరియు.....
- Saketh U
- Published On : March 11, 2022 / 11:31 AM IST
Pooja
Pooja Hegde : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా ‘రాధేశ్యామ్’ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓవర్సీస్ లో, కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు 200 కోట్లకు పైగా జరిగింది. ఇప్పటికే సినిమా ఒక విజువల్ వండర్ అని చూసిన వారంతా చెప్తున్నారు. అద్భుతమైన లవ్ స్టోరీకి మరింత అద్భుతమైన విజువల్స్ ని జత చేసి సినిమాని చిత్రీకరించారని అభిమానులు అంటున్నారు.
Bheemla Nayak : ‘రాధేశ్యామ్’ రాకతో ‘భీమ్లా నాయక్’కి దెబ్బ.. నష్టాల్లో డిస్ట్రిబ్యూటర్స్..
అయితే సినిమా గురించి పూజా హెగ్డే ట్వీట్ చేసింది. తన అసిస్టెంట్స్ తో ఉన్న ఫోటో షేర్ చేసి ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేసింది పూజా హెగ్డే. ఆ ఫోటోని షేర్ చేస్తూ.. ”ఈ ఫొటోలో ఉన్న మరియు లేని నా అందమైన బృందానికి నన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ సినిమా సమయంలో మీరు నా కోసం చేసిన అన్నిటికీ నేను కృతజ్ఞతతో ఉంటాను. మీరు ఈ సినిమా ప్రయాణంలో తోడు ఉన్నందుకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేసింది పూజా హెగ్డే.
To my beautiful team (the ones in this photo and the ones not). Thank you for taking care of me.Whatever the result of the film may be, know that I am grateful for all that you have done for me in the course of this film. Ty for being you ❤️ #appreciationpost #radheshyam #prerna pic.twitter.com/TU2Aoneb8E
— Pooja Hegde (@hegdepooja) March 10, 2022
