×
Ad

Posani Krishnamurali : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి నాకు ప్రాణ భయం ఉంది: పోసాని

మీడియాతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ నుంచి నాకు ప్రాణ భయం ఉంది అని తెలిపారు. పవన్ కళ్యాణ్ చెప్పినా ఫ్యాన్స్ వినరని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను చంపడానికి వెనకాడరని అన్నారు.

  • Published On : September 28, 2021 / 06:58 PM IST

Posani

Posani Krishnamurali :  పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ సినీ పరిశ్రమలోనూ, రాజకీయాల్లోనూ సంచలనం సృష్టిస్తుంది. దీనిపై నిన్న పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని దారుణంగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ చాలా తప్పు మాట్లాడారని అన్నాడు. ఈ విమర్శలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోసాని ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. అంతే కాక పోసాని ఫోన్ కి కొన్ని వేల మెసేజ్ లు అసభ్యంగా పంపిస్తున్నారు. అత్యంత దారుణంగా తిడుతూ పోసానికి ఫోన్లు చేస్తున్నారు. దీంతో తీవ్ర అసహనానికి గురయిన పోసాని ఇవాళ మళ్ళీ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై విరుచుకు పడ్డారు.

ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా దూషించారు. ఆడవాళ్ళ జోలికి రావద్దని, ఏమన్నా ఉంటే నన్ను డైరెక్ట్ గా అనమని, ఫ్యామిలీని ఎందుకు లాగుతున్నారని, బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏముందని తీవ్రంగా స్పందించారు. అయితే ఈ ప్రెస్ మీట్ జరిగేటప్పుడే ప్రెస్ క్లబ్ బయట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుమిగూడారు. పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో పోలీసులు కూడా చాలా మంది ప్రెస్ క్లబ్ వద్ద మోహరించారు. అక్కడి వాతావరణం చాలా ఉద్రిక్తగా మారింది.

Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ రాత్రి పదింటికి ఫోన్ చేసి తిట్టారు: పోసాని

దాంతో ప్రెస్ మీట్ అయ్యాక కొద్దిసేపు పోసాని లోపలే ఉన్నారు. వెళ్లేముందు మీడియాతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ నుంచి నాకు ప్రాణ భయం ఉంది అని తెలిపారు. పవన్ కళ్యాణ్ చెప్పినా ఫ్యాన్స్ వినరని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను చంపడానికి వెనకాడరని అన్నారు. దీంతో ప్రెస్ క్లబ్ బయట ఉద్రిక్తత బాగా పెరిగింది. పోసాని బాడీ గార్డులు, పోలీసుల సహాయంతో అక్కడి నుంచి వెళ్లారు. గొడవ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.