Prabhas congrats to pawan kalyan
Prabhas : టాలీవుడ్ బడా నిర్మాత డివివి దానయ్య ఈరోజు ఉదయం అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకోవడంతో ఈ నిర్మాత తదుపరి సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రకటించి సోషల్ మీడియా మొత్తని ఒక ఊపు ఊపేశాడు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ వీరాభిమాని సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Pawan Kalyan : మరో సూపర్ క్రేజీ కాంబో.. RRR నిర్మాతతో.. సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్.. అఫీషియల్..
గత కొన్నిరోజులుగా సుజిత్, పవన్ కళ్యాణ్ సినిమాపై వార్తలు వినిపిస్తుండగా, వాటిని నిజం చేస్తూ నేడు నిర్మాత దానయ్య సినిమా ప్రకటన చేశాడు. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రానికి సుజిత్ కథని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రకటనతో పలువురు సినీప్రముఖులు చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా పవన్ కళ్యాణ్ కి కంగ్రాట్స్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు.
గతంలో సుజిత్, ప్రభాస్ కలియకలో ‘సాహో’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. తన స్టైలిష్ మేకింగ్ తో ఆ సినిమాలో ప్రభాస్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించాడు. ఇప్పుడు తన అభిమాన హీరోతో సినిమా చేస్తుండడంతో, పవన్ కళ్యాణ్ ని ఏ రేంజ్ లో చూపించనున్నాడో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది అనేది మాత్రం తెలియజేయలేదు మేకర్స్.