Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
పాన్ ఇండియా స్టార్ నుండి యూనివర్శల్ స్టార్ గా మారి భారీ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశాడు. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్..
- Naresh Mannam
- Published On : September 27, 2021 / 11:06 AM IST
Adipurush
Adipurush: పాన్ ఇండియా స్టార్ నుండి యూనివర్శల్ స్టార్ గా మారి భారీ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశాడు. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K సినిమాలను వరసగా పూర్తిచేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇందులో రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇప్పటికే చివరి దశకు చేరుకోగా.. ఫైనల్ గా ఆదిపురుష్ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశాడు.
Prabhas: పక్కా ప్లాన్.. ఒకేసారి 4 సినిమాలు లైన్లో పెట్టిన యూనివర్సల్ స్టార్!
ఆదిపురుష్ వచ్చే ఏడాది ఆగష్టు లో విడుదల కానుంది అంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, అనుకున్నట్లుగానే 2022 ఆగష్టు 08న సినిమా విడుదల కాబోతోందని అధికారిక ప్రకటన వచ్చేసింది. దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రామునిగా నటిస్తుండగా, కృతి సనన్ సీత పాత్ర నటిస్తుంది. ఇక రామాయణ కథలోని మెయిన్ విలన్ రోల్ రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.
Prabhas: ప్రభాస్ బాడీ బిల్డింగ్ తిప్పలు.. రెస్ట్ కోసం ఫారిన్ టూర్?
ప్రస్తుతం ఆదిపురుష్ ముంబైలో ప్రత్యేకమైన సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటుండగా.. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కన్నా ఎక్కువగా సీజీ ఉంటుంది. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోండగా.. అక్టోబర్ 9 వరకు 26 రోజులు సాగే ప్రస్తుత లాంగ్ షెడ్యూల్ లో హై యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలను తెరకెకెక్కించనున్నారట. కాగా, ఇప్పటికే ఆదిపురుష్ నుండి వచ్చిన అప్డేట్స్ ప్రభాస్ అభిమానులలో భారీ అంచనాలు నెలకొనగా.. ఇప్పుడు విడుదల తేదీ ప్రకటనతో ఫ్యాన్స్ పండగచేసుకుంటున్నారు.
PRABHAS: 'ADIPURUSH' LOCKS 11 AUG 2022… #Adipurush [#3D] #Prabhas #SaifAliKhan #KritiSanon #SunnySingh #IndependenceDay weekend #Hindi #Telugu #Tamil #Kannada #Malayalam pic.twitter.com/bz6hSms6N7
— taran adarsh (@taran_adarsh) September 27, 2021
