Fauzi: ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది!

ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ఫౌజీ(Fauzi)’ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Prabhas fauzi movie first song release update

  • ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో ‘ఫౌజీ’
  • త్వరలో మొదటి పాట విడుదలవుతుంది.
  • ఈ ఏడాది చివరలో థియేటర్లలోకి.

Fauzi: పాన్ ఇండియా ప్రభాస్, సీతారామం దర్శకుడు హను రాఘవపూడి కలయికలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఫౌజీ(Fauzi)’. ఈ సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 75 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది.

Dacoit OTT: ఓటీటీలో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘డెకాయిట్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ వేగం పెంచాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెలలోనే ‘ఫౌజీ’ సినిమా నుంచి మొదటి లిరికల్ పాటను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ గీతంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ పాట విడుదల తేదీపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. సుదీప్ ఛటర్జీ విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

టీ సిరీస్ సమర్పణలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో థియేటర్లలో సందడి చేయనుంది. హను రాఘవపూడి తనదైన శైలిలో యుద్ధం నేపథ్యమున్న ప్రేమకథను అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు భిన్నంగా, క్లాసిక్ లుక్‌లో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. యుద్ధం, భావోద్వేగాల కలయికగా రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.