Fauzi : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. షర్ట్ లేకుండా ప్రభాస్ పోస్టర్ అదిరిందిగా..

ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ ప్రకటించారు. (Fauzi)

  • Updated on- July 16, 2026 / 11:35 AM IST

Fauzi

Fauzi : ఇటీవల సంక్రాంతికి రాజాసాబ్ సినిమాతో వచ్చి నిరాశపరిచిన ప్రభాస్ త్వరలో ఫౌజీ సినిమాతో రాబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రేమ, యుద్ధం కాన్సెప్ట్ తో పీరియాడిక్ సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఫౌజీ. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ వ్యక్తిగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ చేస్తామన్నారు కానీ షూటింగ్ పూర్తవకపోవడంతో ఫౌజీ వాయిదాపడింది. తాజాగా ఫౌజీ సినిమా నుంచి అజ్ఞాతపర్వం అంటూ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ ప్రకటించారు. ఫౌజీ సినిమా డిసెంబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక రిలీజ్ డేట్ పోస్టర్ లో ప్రభాస్ షర్ట్ లేకుండా రక్తపాతం సృష్టించి ఒళ్ళంతా రక్తంతో అలిసి కూర్చున్నట్టు కనిపిస్తుంది. దీంతో ఈ మాస్ పోస్టర్ వైరల్ గా మారింది.

Also Read : Vrushakarma : నాగచైతన్య ‘వృషకర్మ’.. వామ్మో నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎన్ని కోట్లకు అమ్ముడయిందో తెలుసా?

ఈ పోస్టర్ పై ఉన్న ఓ స్టాంప్ కూడా ఆసక్తికరంగా మారింది. ఆ స్టాంప్ లో అజ్ఞాత పర్వం, మోస్ట్ వాంటెడ్ 1932 నుంచి అని ఉంది. దీంతో స్వాతంత్రం రాకముందు కథ అని, ప్రభాస్ కోసం అందరూ వెతుకుతారని తెలుస్తుంది.