Prabhas – Hanu Raghavapudi : ప్రభాస్ హను రాఘవపూడి సినిమా అప్డేట్.. టైటిల్ ఇదే.. షూటింగ్ అప్పట్నుంచే..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌ల క‌ల్కి సినిమాతో భారీ హిట్‌ను అందుకున్నాడు.

Prabhas – Hanu Raghavapudi movie latest update title fix

Prabhas – Hanu Raghavapudi : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌ల క‌ల్కి సినిమాతో భారీ హిట్‌ను అందుకున్నాడు. ఈ విజ‌యం ఇచ్చిన జోష్‌తో ప్ర‌భాస్ వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో స‌లార్ 2, రాజా సాబ్‌, క‌ల్కి 2, స్పిరిట్ వంటి సినిమాలు ఉన్నాయి. ఇక హ‌నురాఘ‌వ పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న ఓ సినిమాలో న‌టించ‌నున్న‌ట్లు గ‌త కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఇందుకు లైన్ క్లియ‌ర్ అయింది. హ‌నురాఘ‌వ పూడి డైరెక్ష‌న్‌లో న‌టించేందుకు ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇక ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లు కానుంది. ఈ చిత్రానికి ఫౌజీ అనే పేరును ప‌రిశీలిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఆగ‌స్టు 17న హైద‌రాబాద్‌లో ఈ మూవీకి సంబంధించిన‌ పూజా కార్య‌క్ర‌మాలు చేయ‌నున్నారు.

Mahesh Babu : ‘ల‌వ్ యూ..’ అంటూ మ‌హేశ్ బాబు పోస్ట్‌.. ఎవ‌రిని ఉద్దేశించో తెలుసా..?

ఇక ఈ సినిమా షూటింగ్ ఆగ‌స్టు 18 నుంచి ప్రారంభం కానుంది. మూడు వారాల పాటు మధైర‌లో జ‌ర‌గ‌నుంది. మూడు వారాల పాటు జ‌ర‌గ‌నున్న ఈ మూవీ షూటింగ్‌లో ప్ర‌భాస్ 10 రోజులు పాల్గొనున‌న్నాడ‌ని తెలుస్తోంది. ఆగ‌స్టు 22 నుంచి ఆయ‌న షూటింగ్ జాయిన్ కానున్నాడ‌ట‌.

ట్రెండింగ్ వార్తలు