Masthu Shades Unnai Ra : హీరోగా కమెడియన్ ఫస్ట్ సినిమా.. ఓటీటీలో దూసుకుపోతుందిగా..
కామెడీ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా సినిమా థియేటర్స్ లో పర్వాలేదనిపించినా ఓటీటీలో దూసుకుపోతుంది.

Abhinav Gomatam Masthu Shades Unnai Ra Creates new Records in OTT Streaming
Masthu Shades Unnai Ra : కమెడియన్ అభినవ్ గోమఠం హీరోగా మారి తెరకెక్కించిన మొదటి సినిమా ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’. ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్స్ లో రిలీజయింది. కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకపంపై భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, వి ప్రశాంత్ నిర్మాణంలో తిరుపతిరావు ఇండ్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో వైశాలి రాజ్ హీరోయిన్ గా నటించగా డైరెక్టర్ తరుణ్‌భాస్కర్, అలీ రేజా, రవీందర్ రెడ్డి, సూర్య, రాకెట్ రాఘవ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
Also Read : Jathara : భయపెట్టించే ‘జాతర’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..
కామెడీ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా సినిమా థియేటర్స్ లో పర్వాలేదనిపించినా ఓటీటీలో దూసుకుపోతుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా ఇప్పటికే ఈ సినిమా 100 మిలియన్స్ పైగా రియల్ టైం వాచ్ మినిట్స్‌తో రికార్డ్ సృష్టించింది. ఎవరైనా ఈ సినిమాని మిస్ అయితే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చూసేయండి.