Prabhas : లండన్‌లో ప్రభాస్ ఇల్లు తీసుకున్నారా? వామ్మో.. మరీ అంత రెంటా?
ప్రభాస్ లండన్ లో ఓ ఖరీదైన ఇంటిని రెంట్ కి తీసుకున్నట్టు తెలుస్తుంది.
- Saketh U
- Published On : February 26, 2024 / 01:58 PM IST
Prabhas has taken an expensive house on rent in London Rumours Goes Viral
Prabhas : మన సెలబ్రిటీలు బయట దేశాల్లో కూడా ఆస్తులు కొంటూ ఉంటారు. ఇక్కడ మన దగ్గర సెలబ్రిటీలు, స్టార్ హీరోలు ఫ్రీగా తిరగలేరు. దీంతో సమయం కుదిరినప్పుడల్లా చాలా మంది స్టార్స్ విదేశాలకు ట్రిప్స్ కి వెళ్తుంటారు. మహేష్ లాంటి స్టార్స్ కొంతమంది రెగ్యులర్ గా విదేశాలకు వెళ్తుంటారు. దీంతో వాళ్ళు వెళ్లిన ప్రతిసారి ఉండటం కోసం హోటల్స్, లొకేషన్స్ చూసుకోవడం కన్నా ఒక ఇల్లు కొనుక్కోవడం లేదా రెంట్ తీసుకోవడం చేస్తారు.
మహేష్ బాబుకి దుబాయ్ లో ఆల్రెడీ ఓ ఇల్లు ఉందని సమాచారం. పలువురు సెలబ్రిటీలకు అమెరికాలో కూడా ఇళ్ళు ఉన్నాయని తెలుస్తుంది. ఇటీవల ఇంగ్లాండ్ లో చాలా మంది ఇండియన్స్ ఆస్తులు కొనుక్కుంటున్నారని ఓ సర్వే కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కూడా లండన్(London) లో ఓ ఖరీదైన ఇంటిని రెంట్ కి తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో ప్రభాస్ రెండు, మూడు సార్లు లండన్ కి వెళ్ళాడు. ఇటీవల జరిగిన కాలికి ఆపరేషన్ కూడా అక్కడే చేయించుకున్నాడు.
Also Read : Sheeva Rana : గిల్లితే గిల్లించుకోవాలి.. ‘పోకిరి’ బోల్డ్ భామ గుర్తుందా? ఇప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది?
దీంతో ప్రభాస్ రెగ్యులర్ గా లండన్ వెళ్లడం, వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉండటానికి ఇళ్ళు రెంట్ కి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ ఇంటి రెంట్ ఇండియా కరెన్సీలో ఏకంగా 20 లక్షల రూపాయలు అని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో అధికారికంగా ఎవరన్నా ప్రభాస్ సన్నిహితులు చెప్తే గాని తెలీదు.
