×
Ad

Prabhas: బాహుబలి ది ఎపిక్ స్పెషల్ స్క్రీనింగ్.. జపాన్ లో ప్రభాస్.. కొత్త లుక్ ఫోటోలు వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) జపాన్ వెళ్లారు. అక్కడ ఆయన బాహుబలి ది ఎపిక్ స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన జపాన్ ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించారు.

Prabhas in Japan: New look trending on social media

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) జపాన్ వెళ్లారు. అక్కడ ఆయన బాహుబలి ది ఎపిక్ స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన జపాన్ ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ కూడా మునుపెన్నడూ కనిపించనంత కొత్తగా ఈ ఫోటోలలో కనిపిస్తున్నాడు. దీంతో ఈ న్యూ లుక్ ప్రభాస్ కొత్త సినిమా కోసమే అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సినిమా ఏదైనా మా డార్లింగ్స్ లుక్స్ మాత్రం కేక అంతో కామెంట్స్ చేస్తున్నారు.

The Girlfriend OTT: ఓటీటీకి వచ్చేసిన సూపర్ హిట్ “ది గర్ల్ ఫ్రెండ్” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇక ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. అందులో ఒకటి దర్శకుడు హను రాఘవపూడితో చేస్తున్న ఫౌజీ కాగా.. రెండవది సందీప్ రెడ్డి వంగా చేస్తున్న స్పిరిట్ సినిమాలు ఉన్నాయి. ఇందులో ఫౌజీ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలుకాగా.. స్పిరిట్ సినిమా షూటింగ్ ఈమద్యే మొదలయ్యింది. దీంతో, ప్రభాస్ మైంటైన్ చేస్తున్న కొత్త లుక్ ఆ సినిమా కోసమే అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. ఇదే గనక సినిమాలో లుక్ అయితే మాత్రం అదిరిపోవడం ఖాయం అంటూ రెస్పాండ్ అవుతున్నారు. మొత్తానికి ఒక లుక్ తో సోషల్ మీడియాను షాక్ చేస్తున్నాడు ప్రభాస్.