The Girlfriend OTT: ఓటీటీకి వచ్చేసిన సూపర్ హిట్ “ది గర్ల్ ఫ్రెండ్” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ "ది గర్ల్ ఫ్రెండ్(The Girlfriend OTT)". నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

The Girlfriend OTT: ఓటీటీకి వచ్చేసిన సూపర్ హిట్ “ది గర్ల్ ఫ్రెండ్” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Rashmika Mandanna The Girlfriend movie now streaming on Netflix

Updated On : December 5, 2025 / 2:01 PM IST

The Girlfriend OTT: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ “ది గర్ల్ ఫ్రెండ్(The Girlfriend OTT)”. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్ గా నటించింది. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా యూత్ లేడీస్ ఈ సినిమాకు, సినిమాలోని కంటెంట్ కి బాగా కనెస్ట్ అయ్యారు. దీంతో ఈ సినిమా హిట్ అవడమే కాదు మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది.

Ram Charan-Sukumar: RC 17 కథ సెట్ అయ్యింది.. ఇక దుబాయ్ వెళ్తారట.. ఎందుకో తెలుసా..

ఇక “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా థియేట్రికల్ రిలేస్ అయ్యి నెల రోజులు గడుస్తున్న వేళ తాజాగా ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొతం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5 నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక థియేటర్స్ లో మంచి టాక్ తెచుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.