Prabhas interesting comments about love and marriage
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి వార్త అనేది ఎప్పుడు వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ఇంటర్వ్యూలు, మీడియా మీట్ ఎక్కడైనా ఆయన్ని అడిగే ఒకే ఒక ప్రశ్న ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని. ఆలాగే, ఆయన ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు, ఈ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడు అనే వార్తలు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ, ప్రభాస్ మాత్రం ఈ న్యూస్ గురించి కూడా ఓపెన్ గా ఎక్కడ చెప్పలేదు.
అందుకే, ఆయన పెళ్లి అనేది ఎప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఫస్ట్ టైం ప్రేమ గురించి ఓపెన్ అయినట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రీసెంట్ గా విడుదలైన మూవీ కపుల్ ఫ్రెండ్లీ. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. యువీ క్రియేషన్స్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ప్రభాస్ తో స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు మేకర్స్.
BMW OTT: ఓటీటీకి వచ్చేసిన రవితేజ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ ఇంటర్వ్యూలో కపుల్ ఫ్రెండ్లీ మూవీ టీం పాల్గొన్నారు. ఇందులో భాగంగా టీం అడిగిన చాల ప్రశ్నలకు సమాధానం చెప్పాడు ప్రభాస్(Prabhas). ఇందులో భాగంగానే మానస వారణాసి ప్రభాస్ ను ప్రేమ గురించి ఒపీనియన్ ని అగిడింగి. దానికి సమాధానంగా ప్రభాస్ మాట్లాడుతూ.. ఇది నీ పర్సనల్ క్వశ్చన్ గా కదా అంటూ నవ్వాడు. నిజానికి, నాకు ప్రేమిచాలని ఉంది. ప్రేమలో పడాలని ఉంది. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నా. ఆ ఫీలింగ్ ని ఫీల్ అవ్వాలని ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.
దీంతో, ప్రభాస్ లవ్ పై చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ లుక్స్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఆ లుక్స్ ఫౌజీ సినిమాలోనిది అని తెలుస్తోంది. ఇక హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.