Kalki 2898 AD : కొత్త గవర్నమెంట్ వచ్చాకే.. కల్కి వస్తాడట.. అంటే ఆ సినిమా తేదీకే..

కొత్త గవర్నమెంట్ వచ్చాకే.. కల్కి వస్తాడట. అంటే ఆ సినిమా రిలీజ్ డేట్ నే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

Prabhas Kalki 2898 AD movie aiming to release after elections

Kalki 2898 AD : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాని మే 9న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే ఆ సమయంలో ఎన్నికలు రావడంతో రిలీజ్ సందేహంలో పడింది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం.. ఎన్నికల టైములో రిలీజ్ అయితే కమర్షియల్ గా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది.

దీంతో సినిమా పోస్టుపోన్ వేయాల్సి వస్తుంది. అయితే వాయిదా పడి, మళ్ళీ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది అనేది ప్రశ్నగా మారింది. ఇక ఈ ప్రశ్నకు సమాధానంగా ఇండస్ట్రీ వర్గాల్లో అనేక తేదీలు వినిపిస్తున్నాయి. బాహుబలి 1 రిలీజైన జులై 10న ఈ సినిమా రిలీజ్ అవుతుందని, కాదు మే నెలాఖరులో 30వ తారీఖున రిలీజ్ అవుతుందని కామెంట్స్ వినిపించాయి. కానీ మూవీ టీం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం రాలేదు.

Also read : Teja Sajja – Manchu Manoj : తేజ సజ్జ హీరోగా.. మంచు మనోజ్ విలన్.. ఆ దర్శకుడితో సినిమా..

అయితే ఇప్పుడు ఈ రిలీజ్ గురించి ఇండస్ట్రీలో మరో కొత్త వార్త వినిపిస్తుంది. ఈ సినిమాని ఎన్నికలు పూర్తి అయ్యి, కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తరువాతే ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారట. ఈ వార్తని బట్టి చూస్తే, కల్కి.. బాహుబలి 1 రిలీజ్ డేట్ కే రావాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఫైనల్ గా కల్కి టీం ఏ డేట్ ని ఫిక్స్ చేస్తారో చూడాలి. ఇక ఈ రిలీజ్ డేట్ విషయం ఫ్యాన్స్ ఒకటే కోరుకుంటున్నారు. సినిమా విడుదల ఆలస్యం అయినా పర్వాలేదు, ప్రమోషన్స్ ని మాత్రం కొంచెం పక్కాగా చేయండి అంటూ కోరుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు