Teja Sajja – Manchu Manoj : తేజ సజ్జ హీరోగా.. మంచు మనోజ్ విలన్.. ఆ దర్శకుడితో సినిమా..

మంచు మనోజ్ విలన్ గా తేజ సజ్జ ఓ సినిమా చేయబోతున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో ఓ మలయాళ స్టార్ హీరో ఓ ముఖ్య పాత్ర చేసి గెస్ట్ అపిరెన్స్ ఇవ్వబోతున్నారట.

Teja Sajja – Manchu Manoj : తేజ సజ్జ హీరోగా.. మంచు మనోజ్ విలన్.. ఆ దర్శకుడితో సినిమా..

Manchu Manoj playing protagonist role in Teja Sajja movie

Updated On : April 14, 2024 / 2:29 PM IST

Teja Sajja – Manchu Manoj : టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ.. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా వైడ్ భారీ విజయాన్ని అందుకున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి.. తేజ సజ్జ ఇమేజ్ పెంచేసింది. దీంతో ఈ యువ హీరో తాను చేయబోయే తదుపరి సినిమాలు ఆ ఇమేజ్ కి తగ్గట్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈక్రమంలోనే ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేశాడు.

మంచు మనోజ్ విలన్ గా తేజ సజ్జ ఓ సినిమా చేయబోతున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్య పాత్ర చేసి గెస్ట్ అపిరెన్స్ ఇవ్వబోతున్నారట. ఇంతకీ ఈ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేస్తున్న డైరెక్టర్ ఎవరు..? అతను మరెవరో కాదు, రీసెంట్ గా రవితేజతో ‘ఈగల్’ వంటి సూపర్ స్టైలిష్ ఫిలిం తెరకెక్కించిన కార్తీక్ ఘట్టమనేని. తేజ సజ్జ తన నెక్స్ట్ మూవీ కార్తీక్ తో చేస్తున్నారు. సూర్య వెర్సస్ సూర్య, ఈగల్ వంటి డిఫరెంట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కార్తీక్.. ఇప్పుడు తేజ సజ్జతో ఇంకెలాంటి మూవీ తెరకెక్కించబోతున్నారో అని అందరిలో ఆసక్తి నెలకుంది.

Also read : Ram Charan : తండ్రిగా ఎంతో గర్వంగా ఉంది.. పుత్రోత్సాత్వంతో చిరంజీవి ట్వీట్..

ఆ ఆసక్తికి ఇప్పుడు మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్ కాస్టింగ్ యాడ్ అవ్వడంతో.. ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి తేజ సజ్జ, కార్తీక్ ఘట్టమనేని స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తారో చూడాలి. కాగా ఈ ప్రాజెక్ట్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీగా నిర్మించబోతోంది.