Radhe Shyam : సంక్రాంతికి ‘రాధే శ్యామ్’.. ‘వర్షం’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?
వరల్డ్ వైడ్‌గా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అప్డేట్ రానే వచ్చింది..
- sekhar
- Published on- July 30, 2021 / 11:10 AM IST
Radhe Shyam
Radhe Shyam: ‘బాహుబలి’ తెచ్చిపెట్టిన ‘పాన్ ఇండియా స్టార్’ క్రేజ్‌ని నిలబెట్టుకోవడానికి తనవంతుగా ఎంత కష్టపడాలో అంతా పడుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్.. వరుసగా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారు. దాదాపు మూడేళ్లుగా ‘రాధే శ్యామ్’ సినిమాకే అంకితమైపోయారు ప్రభాస్ అండ్ రాధా కృష్ణ.. డార్లింగ్ అండ్ గోర్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో, రెబల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద (ప్రభాస్ సిస్టర్) ఈ పాన్ ఇండియా సినిమాను భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఎట్టకేలకు ‘రాధే శ్యామ్’ షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశారు. వరల్డ్ వైడ్‌గా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ‘రాధే శ్యామ్’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యనున్నట్లు చెప్తూ.. ‘న్యూ ఇయర్.. న్యూ బిగినింగ్స్.. అండ్ ఎ న్యూ రిలీజ్ డేట్’ అంటూ 2022 జనవరి 14న డేట్ ఫిక్స్ చేసేశారు. డార్లింగ్ కెరీర్లో మెమరబుల్ లవ్ స్టోరీగా గుర్తుండిపోయే ‘వర్షం’ మూవీ 2004లో జనవరి 14నే రిలీజ్ అయ్యింది. ‘రాధే శ్యామ్’ విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
రిలీజ్ డేట్‌తో వదిలిన పోస్టర్లో డార్లింగ్ సూట్లో ఉన్న స్టైలిష్ లుక్ అదిరిపోయింది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, కన్నడ, తమిళ, మలయాళీ వెర్షన్స్‌కి సంగీతాన్ని అందిస్తున్నారు. మిథున్, మనన్ భరద్వాజ్ హిందీ వెర్షన్‌కి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
