Salaar 2: అది కదా అసలైన ఊచకోత.. సలార్ 2 పై ఇండస్ట్రీని షేక్ చేస్తున్న క్రేజీ అప్‌డేట్!

సాలార్ 2 (Salaar 2)సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

prabhas Salaar Part 2 Shouryaanga Parvam movie shooting starts from 2027 january

  • ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్
  • సలార్ 2: శౌర్యాంగ పర్వం మొదలయ్యేది అప్పుడే
  • షూటింగ్ డేట్ లాక్ చేసిన మేకర్స్

Salaar 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం(Salaar 2)’ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొదటి భాగం ముగింపులో ఇచ్చిన క్లూస్, శౌర్యాంగ తెగకు సంబంధించిన నేపథ్యంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కథలో ఇంటెన్స్ ను పెంచుతూ మొదటి భాగాన్ని మించిన యాక్షన్ సన్నివేశాలతో ఈ సీక్వెల్ ఉండబోతోందని తెలుస్తోంది.

SatyaSri: వాడపల్లి వెంకన్న సన్నిధిలో జబర్దస్త్ సత్యశ్రీ.. ట్రెడిషనల్ లుక్‌ ఫొటోలు వైరల్

ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో చేస్తున్న డ్రాగన్ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉండగా, ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. వీరిద్దరూ తమ ప్రస్తుత ప్రాజెక్టులను 2026 చివరి నాటికి పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేసిన వెంటనే, ప్రభాస్ కూడా తన కమిట్‌మెంట్స్ ముగించుకుని సలార్ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ గ్యాప్‌లో స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులను పక్కాగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

పక్కా ప్లానింగ్ ప్రకారమే అంతా జరిగితే, 2027 ప్రారంభంలో ‘సలార్ 2’ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ లోపు ఈ ఏడాది చివర్లో ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక అప్‌డేట్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శౌర్యాంగ పర్వం ద్వారా ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య సాగే ఆధిపత్య పోరును మరింత ఉత్కంఠభరితంగా చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్. హొంబాలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో, రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కనున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.