Salaar : ‘సలార్’లో ప్రభాస్ నడిపిన బైక్ గెలుచుకోవాలని ఉందా.. అయితే ఈ కాంటెస్ట్‌లో పాల్గొనండి..

'సలార్'లో ప్రభాస్ నడిపిన బైక్ గెలుచుకోవాలని ఉందా. అయితే ఈ కాంటెస్ట్‌లో పాల్గొని బైక్ ని గెలిచేసుకోండి.

Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ప్రభాస్ స్టామినాని మళ్ళీ మరోసారి అందరికి గుర్తు చేసింది. ఇక ఆ తరువాత ఓటీటీకి వచ్చిన ఈ చిత్రం.. అక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ ని అందుకుంది. ఇప్పుడు టెలివిజన్ లో సందడి చేయడానికి రెడీ అవుతుంది.

ఈ ఆదివారం (ఏప్రిల్ 21) సాయంత్రం 5.30 గం.లకు స్టార్ మా ఛానల్ ఈ సినిమా ప్రసారం కాబోతుంది. ఇక ఈ సినిమా ప్రసారని మరింత ప్రత్యేకం చేయడం కోసం స్టార్ మా ఛానల్ ఓ ఎస్ఎంఎస్ కాంటెస్ట్ ని నిర్వహిస్తుంది. ఈ కాంటెస్ట్ లో గెలుస్తే.. ‘సలార్’లో ప్రభాస్ నడిపిన బైక్ గెలుచుకోవచ్చు. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే.. స్టార్ మాలో సలార్ సినిమా ప్రసారం అవుతున్న టైములో స్క్రీన్ పై ఎడమవైపు బైక్ ఇమేజ్ ఎన్నిసార్లు కనిపించిందో గమనించి +91 9222211199 నెంబర్ కి మెసేజ్ చేయాలి.

Also read : Seetha Kalyana Vaibhogame Teaser : ‘సీతా కళ్యాణ వైభోగమే’ టీజర్‌ రిలీజ్.. విలేజ్ లవ్ స్టోరీతో..

అయితే ఈ మెసేజ్ ని ఎలా చేయాలంటే.. SALAAR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, ఆ తరువాత బైక్ ఎన్నిసార్లు కనిపించిందో ఆ సంఖ్యని టైప్ చేసి పైన తెలిపిన నెంబర్ కి మెసేజ్ చేయాలి. మరి ఈ సువర్ణావకాశాన్ని మిస్ చేసుకోకండి. ప్రభాస్ నడిపిన ఆ బండిని చిన్న ఎస్ఎంఎస్ ద్వారా సొంతం చేసేసుకోండి.

ట్రెండింగ్ వార్తలు