Spirit: గుండుతో ప్రభాస్.. స్పిరిట్ షూటింగ్ పిక్ లీక్.. లుక్ నెక్ట్స్ లెవల్లో ఉందిగా!

ప్రభాస్ 'స్పిరిట్(Spirit)' సినిమా లీకైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

prabhas spirit movie leaked photo goes viral on social media

  • గుండుతో ప్రభాస్.. స్పిరిట్ లుక్ లీక్.
  • సందీప్ రెడ్డి వంగ భారీ ప్లాన్.
  • నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ పిక్.

Spirit: గ్లోబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సందీప్ చేస్తున్న సినిమా కావడంతో, ప్రభాస్‌ను ఆయన ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రభాస్ సరికొత్త లుక్‌కు సంబంధించిన ఒక ఫోటో లీక్ కావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షేక్ అవుతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రభాస్ ‘గుండు’తో కనిపిస్తుండటం అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది.

Ashu Reddy: నటి అషురెడ్డికి CCS పోలీసుల షాక్.. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు

ఈ లీక్ అయిన ఫోటోలో ప్రభాస్ ఖైదీ లుక్ లో గుండుతో కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూస్తుంటే సందీప్ రెడ్డి వంగ (Spirit)ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతోంది. సినిమాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారనే వార్తలు ఇప్పటికే ఉండగా, ఈ గుండు లుక్ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కోసమా లేదా క్యారెక్టరైజేషన్‌లో భాగమా అన్న చర్చ మొదలైంది. ప్రభాస్ డెడికేషన్‌ను చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సందీప్ మార్క్ వైలెన్స్, ప్రభాస్ మాస్ అప్పీల్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుండటంతో, స్పిరిట్ టీమ్ అప్రమత్తమైంది. లీకేజీల వల్ల సినిమాపై ఉన్న సస్పెన్స్ దెబ్బతింటుందని భావించినా, ఈ లుక్ మాత్రం సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేసింది. ప్రభాస్ ఇదివరకు చేసిన సినిమాల కంటే ఇది చాలా భిన్నంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. “నెక్స్ట్ లెవల్” లో ఉన్న ఈ లుక్ వెనుక పెద్ద కథే ఉంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. అయితే, మరికొంతమందేమో ఇది ఒరిజినల్ పిక్ కాదని, ఏఐ క్రియేటెడ్ అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నెట్టింట దర్శనమిచ్చిన ఒక పిక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది అనే చెప్పాలి.

prabhas spirit movie leaked photo goes viral on social media