Prabhas Spirit: విమల్ థియేటర్ లో ‘స్పిరిట్’ షూటింగ్.. ప్రభాస్ రావడంతో ఫ్యాన్స్ రచ్చ

బాలానగర్ విమల్ థియేటర్ లో ప్రభాస్ స్పిరిట్(Prabhas Spirit) సినిమా షూటింగ్ జరుగుతోంది.

Prabhas Spirit movie taking place at Vimal Theatre

  • విమల్ థియేటర్‌లో ‘స్పిరిట్’ షూటింగ్ ప్రారంభం
  • విమల్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా
  • థియేటర్ చుట్టూ భారీ పోలీస్ బందోబస్తు

Prabhas Spirit: రెబల్ స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్పిరిట్(Prabhas Spirit)’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సరికొత్త షెడ్యూల్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా కీలక సీన్ల చిత్రీకరణ కోసం చిత్రబృందం నగరంలోని నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన బాలానగర్ ‘విమల్ థియేటర్’ను ఎంపిక చేసింది.

Preethi asrani: నిమ్మపండు రంగు చీరలో నవయవ్వన సోయగం.. ప్రీతీ అస్రాణి క్యూట్ ఫొటోలు

ఈ ప్రసిద్ధ సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ప్రభాస్‌పై కొన్ని ఇంటెన్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ షూటింగ్‌లో పాల్గొంటున్నారనే వార్త తెలియడంతో విమల్ థియేటర్ వద్దకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. అది కూడా ఒక్కరోజు షూటింగ్ మాత్రమే. ఫ్యాన్స్ హడావుడి పెరగడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చిత్రయూనిట్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలీసుల సహాయంతో జనసందోహాన్ని నియంత్రిస్తూ షూటింగ్‌ను ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తున్నారు.

యాక్షన్, క్రైమ్ డ్రామా నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మలుస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ విలన్‌గా అలరించనున్నారు. కాంచన, ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.