Prabhutva Junior Kalasala Punganuru Movie Streaming New OTT Details Here
Prabhutva Junior Kalasala : ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. బ్లాక్ యాంటీ పిక్చర్స్ బ్యానర్ పై కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
Also Read : Devara Movie : రేపే ‘దేవర’ రిలీజ్.. దేవర గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..
ఈ సినిమా జూన్ 21న థియేటర్స్ లో రిలీజయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమాలో ఇంటర్ చదివే రోజుల్లో టీనేజ్ లవ్ స్టోరీ, తొలిప్రేమ, ఆ ప్రేమలో సమస్యలు, ఫ్యామిలీ పరిస్థితులు.. ఇలాంటి పలు అంశాలతో, ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కించారు. గతంలో ఈ సినిమా తెలుగు ఓటీటీ ఆహాలోకి రాగా తాజాగా మరో ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది.
ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్.. మా ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమాని థియేటర్లో చూసి సపోర్ట్ చేసినవారికి ధన్యవాదాలు. చూడని వాళ్ళు ఇంకా ఉంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది చూసేయండి అంటూ తెలిపారు. టీనేజీ లవ్ స్టోరీ చూడాలంటే ఈ సినిమా చూసేయండి.