Pradeep Ranganathan : పాపం.. హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరోని ముంచేసిన నయనతార భర్త..

హ్యాట్రిక్ హిట్స్ సాధించిన ప్రదీప్ కి ఇప్పుడు ఫస్ట్ ఫ్లాప్ పడింది. (Pradeep Ranganathan)

  • Published on- April 19, 2026 / 07:32 AM IST

Pradeep Ranganathan

  • ప్రదీప్ రంగనాథన్ వరుస హిట్స్ కి బ్రేక్
  • వసూళ్లు రాబట్టలేకపోతున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ
  • నయనతార భర్తని నమ్మి ఫ్లాప్ తెచ్చుకున్న హీరో

Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ తమిళ్ లో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోగా ఎదిగాడు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ దర్శకుడిగా కోమలి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై పర్వాలేదనిపించిన ప్రదీప్ లవ్ టుడే సినిమాతో హీరోగా, దర్శకుడిగా భారీ హిట్ కొట్టాడు. ఆ సినిమాతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఫ్యాన్స్, మార్కెట్ ని సంపాదించుకున్నాడు.

లవ్ టుడే తర్వాత వరుసగా డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో యూత్ ని ఆకట్టుకొని హిట్స్ కొట్టాడు ప్రదీప్. ఈ మూడు సినిమాలు కూడా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ విజయాలనే సాధించాయి. దీంతో ప్రదీప్ సినిమాలపై నమ్మకం ఏర్పడింది. అయితే హ్యాట్రిక్ హిట్స్ సాధించిన ప్రదీప్ కి ఇప్పుడు ఫస్ట్ ఫ్లాప్ పడింది. నయనతార భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమా వచ్చింది. ఇటీవల ఏప్రిల్ 10 న ఈ సినిమా రిలీజయింది.

Also Read : Ruhani Sharma : బాబోయ్ రఫ్ఫాడించే లుక్స్ లో రుహాణి శర్మ.. ఫొటోలు..

తమిళనాడులో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు ఈ సినిమా. ఇక తెలుగులో అయితే ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఫ్యూచర్ 2040లో జరిగే కథతో తెరకెక్కించారు. దాంతో బడ్జెట్ భారీగానే పెట్టారు. ఈ సినిమాకు నిర్మాతల కోసం తిరిగితే విగ్నేష్ కి ఎవరూ దొరక్కపోవడంతో నయనతారే నిర్మాతగా మారింది భర్త కోసం. దాదాపు వంద కోట్ల బడ్జెట్ ఈ సినిమాకు పెట్టినట్టు సమాచారం.

దానికి తోడు టైటిల్ వివాదం, సినిమా పలు కారణాలతో వాయిదాలు పడటంతో సినిమాపై ఎఫెక్ట్ పడింది. ఇప్పటివరకు తెలుగు, తమిళ్ లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా 50 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసిందని సమాచారం. తెలుగులో అయితే కేవలం 4 కోట్లు మాత్రమే వసూలు చేసిందట. చాలా చోట్ల ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదని తెలుస్తుంది.

Also Read : Mega Family : వరుసగా హాస్పిటల్ పాలవుతున్న మెగా హీరోలు.. ఏం జరుగుతోంది..? ఆందోళనలో అభిమానులు..

ప్రదీప్ ని నమ్మి ఈ సినిమాని కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. కానీ దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రదీప్ కి హిట్ ఇవ్వలేకపోయాడు. గత సినిమాల్లో ప్రదీప్ కూడా స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చునేవాడు. కానీ ఈ సినిమాలో ప్రదీప్ కి ఆ అవకాశం లేకపోయింది. అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయిందని అంటున్నారు ఫ్యాన్స్, సినీ విశ్లేషకులు. విగ్నేష్ శివన్ కెరీర్ లో నేను రౌడీనే సినిమా తప్ప ఇంకో హిట్ లేదు. తమిళ్ హీరోలు విగ్నేష్ కి ఛాన్సులు ఇవ్వట్లేదు. ప్రదీప్ రంగనాథన్ విగ్నేష్ ని నమ్మి ఛాన్స్ ఇస్తే ఇలా ఫ్లాప్ ఇచ్చాడని అంటున్నారు. మరి నెక్స్ట్ సినిమాతో ప్రదీప్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడా చూడాలి.