Mega Family : వరుసగా హాస్పిటల్ పాలవుతున్న మెగా హీరోలు.. ఏం జరుగుతోంది..? ఆందోళనలో అభిమానులు..
గత నాలుగు నెలల్లోనే మెగా హీరోలు అంతా వరుసగా గాయాల పాలవడం, పలు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలవడం మెగా అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. (Mega Family)
Mega Family
Mega Family : మెగా హీరోలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా హాస్పిటల్ పాలవుతున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత నాలుగు నెలల్లోనే మెగా హీరోలు అంతా వరుసగా గాయాల పాలవడం, పలు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలవడం మెగా అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.
తాజాగా కొద్ది సేపటి క్రితమే పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వైద్యులు పరీక్షించి శస్త్ర చికిత్స చేసారని, పది రోజుల పాటు విశ్రాంతి త్రీసుకోవాలని వైద్యులు చెప్పినట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. దీంతో రాజకీయాల్లో, సినిమాల్లో చురుగ్గా ఉంటున్న పవన్ ఇలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు అని తెలియడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read : Raasi : పాపం రాశి.. అజయ్ అనుకోని వెళ్తే అజయ్ ఘోష్ కి భార్యగా.. రాశి కామెంట్స్ వైరల్..
ఒక నాలుగు రోజుల క్రితం వరుణ్ తేజ్ బరి సినిమా షూటింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కాలికి గాయం అయిందని, శస్త్ర చికిత్స చేసారని అధికారికంగానే తెలిపారు. కాలికి శస్త్ర చికిత్స జరిగిందని, ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నట్టు వరుణ్ తేజ్ ఇవాళే ప్రకటించాడు.
ఓ రెండు వారాల క్రితం రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. ఏకంగా కంటి పై భాగానికి గాయం అయింది. చరణ్ కి కూడా ఆ గాయానికి చికిత్స చేసారు. కానీ చరణ్ ఒక రోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ షూటింగ్ కి వచ్చేసారు.
నాలుగు నెలల క్రితం మెగాస్టార్ చిరంజీవికి మోకాలికి శస్త్ర చికిత్స జరిగిందని అధికారికంగానే చిరంజీవి వెల్లడించారు. మన శంకర వరప్రసాద్ షూటింగ్, ప్రమోషన్స్ సమయంలో ఆయన కాలి నొప్పితో బాగా ఇబ్బంది పడ్డారని టాలీవుడ్ అంతా చర్చించుకుంది.
Also Read : Anil Ravipudi : వెంకటేష్, కళ్యాణ్ రామ్ సినిమాకు కూడా ఇన్ని కోట్లా.. అనిల్ రావిపూడిని నమ్మి..
ఇక కొన్ని రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ కూడా సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ సమయంలో పలు ఆరోగ్య సమస్యలు ఫేస్ చేసాడని, చికిత్స తీసుకొని కొన్ని రోజులు రెస్ట్ అనంతరం మళ్ళీ షూటింగ్ కి వెళ్లారని టాలీవుడ్ లో టాక్ నడిచింది.
ఇలా నాలుగు నెలల గ్యాప్ లోనే మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరోలంతా గాయాలపాలవడం, ఆసుపత్రి పాలవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మెగా ఫ్యామిలీకి ఏమైంది, అందరూ ఒకేసారి ఎఫెక్ట్ అవుతున్నారు అంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ హాస్పిటల్ పాలవడం ఇప్పుడు చర్చగా మారింది.
