Anil Ravipudi : వెంకటేష్, కళ్యాణ్ రామ్ సినిమాకు కూడా ఇన్ని కోట్లా.. అనిల్ రావిపూడిని నమ్మి..
ఇటీవల సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమాతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తున్నాడు. (Anil Ravipudi)
Anil Ravipudi
Anil Ravipudi : అనిల్ రావిపూడి సినిమా సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్లో సినిమాలు చేసి నిర్మాతలకు భారీ ప్రాఫిట్స్ తెచ్చిపెడుతున్నారు అనిల్ రావిపూడి. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేలా చేస్తున్నాడు అనిల్. ఇటీవల సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమాతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ వెంకటేష్ – కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ మొదలవ్వనుంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా మొదలవ్వకుండానే బిజినెస్ కూడా జరిగిపోతుంది. తాజా సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకు ఓటీటీ, శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం.
Also Read : Hansika Motwanni : దేశముదురు వివాదం.. ఇన్నేళ్ల తర్వాత ఇంజెక్షన్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
ఓ అగ్ర ఓటీటీ సంస్థ వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబోతో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా హక్కులను ఏకంగా 70 కోట్లు ఇచ్చి కొనుక్కుంటుందట. కళ్యాణ్ రామ్, వెంకటేష్ మార్కెట్ కి ఇది చాలా ఎక్కువే అని సమాచారం. కేవలం అనిల్ రావిపూడిని నమ్మే ఇంత పెట్టి కొనుక్కున్నారట సినిమాని. దీంతో ఈ అమ్మకం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చగా మారింది.
ఎలాగో అనిల్ రావిపూడి సినిమా హిట్, సంక్రాంతికి వస్తే భారీ కలెక్షన్స్ ఖాయం, దీనికి తోడు వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్, కళ్యాణ్ రామ్ కోసం నందమూరి ఫ్యాన్స్.. ఇవన్నీ ఈ సినిమాకు కమర్షియల్ గా ముందు నుంచే వర్కౌట్ అవుతున్నాయి. దీంతో సినిమా రిలీజ్ తర్వాత హిట్ కొట్టి కాదు సినిమా రిలీజ్ కి ముందే నిర్మాతకు లాభాలు తెచ్చిపెడుతున్నారు అనిల్ రావిపూడి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి అనిల్ రావిపూడి నిర్మాతలకు బంగారు బాతులా మారాడు.
Also Read : Sonali Raut : నా ఆరోగ్యం నాశనం చేసారు.. రెండు కోట్లు కట్టమని బిగ్ బాస్ నిర్వహులకు షాక్ ఇచ్చిన మోడల్..
