Praksah Raj
Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న సమయంలో గాయానికి గురయ్యారు. తమిళ స్టార్ ధనుష్ మంగళవారం షూటింగ్ లో ఈ ఘటన జరిగినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రానికల్లా హైదరాబాద్ కు చేరుకోనున్న ప్రకాశ్ రాజ్ కు సర్జరీ జరగనుంది.
ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రకాష్ రాజ్.. ‘చిన్న ఫ్రాక్చర్
జరిగింది. సర్జరీ కోసం నా స్నేహితుడు డాక్టర్ గురువా రెడ్డి దగ్గరకు వెళ్తాను. నేను బాగానే ఉన్నాను’ అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకొచ్చిన ప్రకాశ్ రాజ్ కు గాయం అని తెలియగానే ఆయన ప్యానెల్ లో గందరగోళం మొదలైంది. దీనిపై ఆయనే స్వయంగా స్పష్టత ఇవ్వడంతో అభిమానులు కాస్త కుదుటపడ్డారు.