Praveen Kandregula : ప్రతి కథ హీరోల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. అవార్డులు వద్దు మాకు.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..
ప్రవీణ్ కామెంట్స్ చర్చగా మారాయి.

Praveen Kandregula
Praveen Kandregula : అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రల్లో తెరకెక్కిస్తున్న మూవీ పరదా. సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పరదా సినిమా ఆగస్టు 22న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు.
పరదా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ.. చాలా కథలు ఉన్నాయి. ప్రతి కథ హీరోల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. హీరోయిన్ సెంట్రిక్ ఫిలిమ్స్ కూడా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. ఈ సినిమా అందరి నిర్మాతలకు ఒక కొత్త హోప్ ఇస్తుంది. ప్రతి సారి స్టార్స్ కే విజిల్స్ వేస్తాం, వాళ్ళ సినిమాలే చూస్తాం. మా అనుపమ కూడా పెద్ద స్టారే. మా దర్శన కూడా పెద్ద స్టారే. సంగీత కూడా స్టార్. ఒక వుమెన్ సినిమా చేస్తే అవార్డులు, పేరు వద్దు డబ్బులు కావాలి. మాకు అవార్డులు వద్దు.
200 సినిమాలు వస్తే అందులో నాలుగైదు వుమెన్ ఓరియెంటెడ్ సినిమా అంటారు. మెన్ ఓరియెంటెడ్ సినిమా అంటారా? ఎందుకు ఇలా. ఏదైనా సినిమానే. మనమంతా మలయాళ సినిమాలు ఎంకరేజ్ చేస్తాం. నాకు ఈ పరదా సినిమా మలయాళంలో పెద్ద హిట్ అవ్వాలి. మనం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా చేయలేమా. అందుకే మలయాళం ఆర్టిస్టులను ఇద్దర్ని పెట్టాను. నేను చిరంజీవి అభిమాని, ఆయన బర్త్ డే రోజు సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా బాగుంటే పెద్ద స్టార్స్ అంతా ఒకే ఒక్క ట్వీట్ చేయండి. మొదటి పది నిముషాలు వెరీ ఇంపార్టెంట్ సినిమాలో. అస్సలు మిస్ అవ్వొద్దు అని ఫైర్ అయ్యారు.
దీంతో డైరెక్టర్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇన్ డైరెక్ట్ గా స్టార్ హీరోలపై కామెంట్స్ చేస్తూనే మళ్ళీ చివర్లో స్టార్స్ ని ట్వీట్ వేయమని అడగడం, మళ్ళీ చిరంజీవి అభిమాని అని చెప్పి హీరోలు అవసర్లేదు అన్ని కథలకు అని మాట్లాడటం, అవార్డులు వద్దు అంటూ మాట్లాడటంతో ప్రవీణ్ కామెంట్స్ చర్చగా మారాయి.
Also Read : Kangana Ranaut : డేటింగ్ యాప్స్, లివ్-ఇన్ కల్చర్ పై కంగనా ఫైర్.. గర్భం వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు?