Producer Kalyan: క్లైమాక్స్‌కి సమ్మె.. త్వరలోనే షూటింగ్స్ ప్రారంభం..! చిరంజీవితో భేటీ తర్వాత నిర్మాత కీలక వ్యాఖ్యలు..
దేశంలోని మిగతా రాష్ట్రాల్లోని సినీ పరిశ్రమల్లో కంటే మన దగ్గర వేతనాలు ఎక్కువే ఉన్నాయన్నారు కల్యాణ్. (Producer Kalyan)

Producer Kalyan: చిన్న నిర్మాతల కన్నా ముందే బడా ప్రొడ్యూసర్ సి కల్యాణ్ మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. రేపు సాయంత్రానికల్లా టాలీవుడ్ సమస్య పరిష్కారం అవుతుంది అంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చిరంజీవితో భేటీ అయిన సి కల్యాణ్ కార్మికులు, నిర్మాతల సమస్యలపై చర్చించారు. సోమవారం ఫెడరేషన్ ప్రతినిధులతో చిరంజీవి సమావేశం కానున్నారని తెలిపారు. సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చిరంజీవి చెప్పినట్లుగా కల్యాణ్ పేర్కొన్నారు.
దేశంలోని మిగతా రాష్ట్రాల్లోని సినీ పరిశ్రమల్లో కంటే మన దగ్గర వేతనాలు ఎక్కువే ఉన్నాయన్నారు కల్యాణ్.
చిరంజీవితో భేటీ తర్వాత నిర్మాత సి కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. చిరంజీవితో చర్చించిన అంశాలు, కార్మికుల సమ్మె, చర్చలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ”రేపు ఫెడరేషన్ వాళ్లు వచ్చి చిరంజీవిని కలుస్తారు.
చాలామంది నిర్మాతలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు..
ఛాంబర్ నుంచి భరత్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సిన్సియర్ గా దీని మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫెడరేషన్ వాళ్లతో ఉదయం నేను మాట్లాడాను. ఏం మాట్లాడాను అనేది చిరంజీవికి వివరించడం జరిగింది.
బయటకు తెలియని విషయం ఏంటంటే.. నిర్మాతల్లో చాలా మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. చిన్న నిర్మాతలు బాగా సఫర్ అవుతున్నారు. వేతనాలు చిన్న సినిమాలకు వర్తించవు.
వాళ్ల సౌకర్యం బట్టి వాళ్లు చేసుకోవాలి అనేది మా స్లోగన్. ఇప్పటికే చిన్న సినిమాలకు ఒక కండీషన్ ఉంది. నా వంతు నేను కృషి చేస్తాను అని, వాళ్లతో మాట్లాడి ఛాంబర్ కు పంపిస్తాను.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూర్స్ కౌన్సిల్ కూర్చుని మాట్లాడుకోండి అని చెప్పారు.
పట్టువిడుపులు లేకుండా చర్చించుకోవాలని సూచించారు..
పట్టువిడుపులు లేకుండా చర్చించుకోవాలని సూచించారు. నేను ఇదే విషయాన్ని ఛాంబర్ వారితో, కౌన్సిల్ వారితో చర్చించాను. భరత్ కూడా దీని గురించి గట్టిగా కృషి చేస్తున్నారు.
ఏది ఏమైనా నాకు తెలిసి కచ్చితంగా చిరంజీవి ఫెడరేషన్ వారితో మాట్లాడాక.. సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నా.
కచ్చితంగా ఈ రెండు రోజుల్లో సమస్య పరిష్కారమై త్వరలోనే షూటింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయని ఆశిస్తున్నా” అని చిరంజీవితో భేటీ తర్వాత నిర్మాత సి కల్యాణ్ అన్నారు.
Also Read: ప్రతి కథ హీరోల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. అవార్డులు వద్దు మాకు.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..
రెండు వారాలుగా సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 30 శాతం వేతనాలు పెంచాలనే ప్రధాన డిమాండ్ తో కార్మికులు సమ్మెకు దిగారు.
అయితే అందుకు నిర్మాతలు ససేమిరా అంటున్నారు. దీనిపై పలు దఫాలుగా ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి.
కానీ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. వేతనాల పెంపు విషయంలో తగ్గేది లేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు.
నిర్మాతలు, కార్మికుల మధ్య చర్చలు విఫలం అవుతున్నాయి. దీంతో సమ్మె కొలిక్కి రావడం లేదు.
Also Read: అవునా.. నిజమా..? తమిళ్ వాళ్లకు వెయ్యి కోట్ల సినిమా ఎందుకు లేదు? ఈ డైరెక్టర్ చెప్పిన ఆన్సర్ వింటే..