Prakash Raj has out from Prabhas Spirit movie.
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్(Spirit). కల్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యానిమల్ సినిమాలో బోల్డ్ సీన్స్ చేసి అదరగొట్టేసిన త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వాయిస్ టీజర్, ప్రభాస్ ఫస్ట్ లుక్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.
Divi: సమ్మక్క సారక్కకు ఎత్తు బంగారం ఇచ్చిన నటి దివి.. ఫొటోలు
ఇక అప్పటినుంచి ఈ సినిమాకు సంబందించిన చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగానే తాజాగా స్పిరిట్ మూవీ నుంచి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, స్పిరిట్ సినిమాలో సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఒక కీ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. స్పిరిట్ వాయిస్ టీజర్ లో కూడా ఆయన పాత్ర పరిచయం చేశాడు. దీంతో, స్పిరిట్ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తాడని అనుకున్నారు అంతా.
కానీ, అనూహ్యంగా స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. కానీ, ఈ న్యూస్ మాత్రం నేషనల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది. అసలు ఈ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక స్పిరిట్ సినిమా నుంచి గతంలో హీరోయిన్ దీపికా పదుకొనె ను తప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రకాష్ రాజ్ విషయంలో కూడా అదే న్యూస్ వైరల్ అవడం అనేది హాట్ టాపిక్ అయ్యింది.