Prakash Raj playing as Shiva devotee in Varanasi movie.
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న భారీ మూవీ వారణాసి(Varanasi). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మహేష్ బాబుకి జోడీగా నటిస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో భారీ గ్రాఫిక్స్ తో, భారీ విజువల్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంతే భారీగా అంచనాలు కూడా నెలకొన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి ఇంటర్నేషనల్ లెవల్లో స్పందన వచ్చింది. అందుకే, ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణంలో వైరల్ అవుతోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, వారణాసి సినిమాలో నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గతంలో స్వయంగా ప్రకాష్ రాజ్ చెప్పిన విషయం తెలిసిందే.
Fahadh Faasil: అక్షరాలా రూ.15 కోట్లు.. బావమరిది పాత్రకి భారీ డిమాండ్.. హీరో, డైరెక్టర్ ఎవరో తెలుసా!
తాజాగా ఆయన పాత్ర గురించి మరో న్యూస్ ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. అదేంటంటే, ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మహా శివభక్తుడిగా కనిపించనున్నాడట. ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ నటన సినిమాకే హైలెట్ గా నిలువనుందని తెలుస్తోంది. ఈ విషయం గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఒక నటుడిగా నా ఆకలి తీర్చే అద్భుతమైన పాత్ర నాకు దొరికింది. అంటూ చెప్పుకొచ్చాడు.
దీంతో ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక వారణాసి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న భారీ ఎత్తున విడుదల కానుంది. మరి విడుదలకు ముందే ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న వారణాసి సినిమా విడుదల తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.