Pranitha : మరోసారి భర్త పాదాలకు పూజ చేసి ఫెమినిస్టులకు గట్టి పంచ్ ఇచ్చిన ప్రణీత..

భర్త పాదలకు పూజ చేసినందుకు గత ఏడాది విమర్శలు, ట్రోల్స్ ఎదురుకున్న హీరోయిన్ ప్రణీత.. ఈ ఏడాది మరోసారి భర్త పాదాలకు పూజ చేసి ఫెమినిస్టులకు గట్టి పంచ్ ఇచ్చింది.

Pranitha Subhash gave counter to feminist to perform pooja for her husband feet

Pranitha : కన్నడ భామ ప్రణీత హీరోయిన్ గా సౌత్ స్టార్ హీరోల పక్కన సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 2021లో పెళ్లి చేసుకున్న ఈ భామ.. గత ఏడాది ఒక పాపకి కూడా జన్మనించింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి సినిమాలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్ గా ఎంత మోడరన్ గా కనిపించినా.. వ్యక్తిగతంగా మాత్రం ప్రణీత సనాతన ధర్మాన్ని బాగా ఫాలో అవుతుంటుంది. ఈ క్రమంలోనే భీమన అమావాస్య సందర్భంగా తన భర్త పాదలకు పసుపు, కుంకుమ, పూలతో పూజ చేసింది. ఈ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Salaar : అమెరికాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సలార్.. అదేంటో తెలుసా..?

భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని భీమన అమావాస్య రోజున ఇలా పూజ చేయడం కర్ణాటకలో సంప్రదాయంగా భావిస్తారు. ఇదే పూజని ప్రణీత గత ఏడాది కూడా నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అప్పటిలో విమర్శలు, ట్రోల్స్ ఎదురుకుంది. కొంతమంది ఫెమినిస్టులు ప్రణీత చేసిన పూజని విమర్శించారు. దీని పై డిబేట్ లు కూడా చేశారు. అప్పటిలో ఆ విమర్శలు, ట్రోల్స్ గురించి ప్రణీతని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. “నేను హీరోయిన్ కాబట్టి, గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నానని పూజలు, పునస్కారాలు చేయనని అనుకోవడం వారి తప్పు” అంటూ సున్నితంగా రియాక్ట్ అయ్యింది.

Gentleman 2 : 30 ఏళ్ళ తరువాత జెంటిల్‌మెన్ సీక్వెల్.. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్.. హీరో, దర్శకుడు ఎవరో తెలుసా..?

అయితే ఈ ఏడాది మళ్ళీ తన భర్త పాదాలకు పూజ చేసి ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. విమర్శలు, ట్రోల్స్ చేసేవారికి గట్టి పంచ్ ఇచ్చింది. ”భీమన అమావాస్య సందర్భంగా నేడు పూజ చేశాను. దీని వల్ల గత ఏడాది ట్రోల్స్ అండ్ విమర్శలు చూశాను. ఇది మీకు పురుష ఆధిపత్యంలా ఉండొచ్చు. కానీ నా వరకు ఇది నా సనాతన ధర్మం. ఈ పూజకి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి మరెన్నో పూజలకు అంతటి ప్రాముఖ్యత ఎందుకొచ్చింది అనేదానికి చాలా కథలే ఉన్నాయి. పురుషాధిపత్యంతోనే హిందూ పూజలు జరుగుతాయి అనడం అర్థంపర్థంలేని వాదన. దేవతలను సమానంగా పూజించే విధానంలో ఇది ఒకటి” అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తో ఫెమినిస్టులకు గట్టి పంచ్ పడినట్లు అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు