Prasanna Kumar Bezawada : జాబ్ లేకపోయినా రెండేళ్లు ఇంటికి శాలరీ పంపించిన స్టార్ రైటర్.. పాపం ఎన్ని కష్టాలు పడ్డాడో..

ఓ రైటర్ జాబ్ చేయకుండానే సినీ పరిశ్రమలో కష్టాలు పడుతూ మరీ ఇంటికి శాలరీ పంపించారట.

Prasanna Kumar Bezawada : సినిమా పరిశ్రమకి వచ్చిన వాళ్ళు సక్సెస్ వచ్చేదాకా కష్టాలు పడాల్సిందే. ఇక కొంతమంది అయితే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నామని చెప్పి సినీ పరిశ్రమలో ప్రయత్నాలు చేస్తారు. అలా ఓ రైటర్ జాబ్ చేయకుండానే సినీ పరిశ్రమలో కష్టాలు పడుతూ మరీ ఇంటికి శాలరీ పంపించారట. సినిమా చూపిస్త మావా, నేను లోకల్, ధమాకా, నా సామి రంగ.. లాంటూ సూపర్ హిట్ సినిమాలకు కథ, మాటలు అందించి మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ.

ప్రసన్న కుమార్ చదువు అయ్యాక ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేసేవాడట. సినిమాల మీద ఇష్టంతో 8 నెలలు జాబ్ చేసి మానేసి సినీ పరిశ్రమలోకి వచ్చారు. అయితే ఇంట్లో జాబ్ మానేశామని చెప్తే ఒప్పుకోరని, ఇంకో జాబ్ వాళ్ళ నాన్నే వెతికిపెడతారని చెప్పకుండా సినీ పరిశ్రమలో కష్టపడుతూనే, బయట వేరే చిన్న చిన్న పనులు చేస్తూనే ఇంటికి కరెక్ట్ గా ఒకటో తారీకు శాలరీ పంపించేవాడట. ఒక్కోసారి అప్పులు చేసి మరీ పంపించేవాడట. ఇంట్లో వాళ్ళు శాలరీ పెరగలేదా అంటే ఇంక్రిమెంట్ పడింది అని ఆరు నెలలకొకసారి శాలరీ పెంచి మరీ పంపించేవారట. ఇలా దాదాపు సినీ పరిశ్రమలో సక్సెస్ అయ్యేవరకు రెండేళ్లు ఇంట్లో శాలరీ పంపించాడట ప్రసన్న కుమార్. ఈ విషయాలన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Also Read : Salaar 2 Movie : సలార్ 2 అప్డేట్.. త్వరలో ప్రభాస్‌ని కలవనున్న ప్రశాంత్ నీల్.. ఎందుకంటే?

ఇక ప్రసన్న కుమార్ మొదట జబర్దస్త్ రచయితగా పనిచేసి అక్కడ పేరు రావడంతో సినిమాల్లోకి వచ్చాడు. మొదటి సినిమా సినిమా చూపిస్తా మావా మంచి హిట్ అవ్వడంతో రచయితగా ప్రసన్న కుమార్ కి మంచి పేరు వచ్చింది. ఇటీవల ధమాకా సినిమాతో 100 కోట్లు కొట్టడంతో స్టార్ రచయితగా మారిపోయాడు ప్రసన్న కుమార్. త్వరలోనే దర్శకుడిగా కూడా మారే ప్రయత్నాలు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు