Varun Tej: అటు అట్లీ.. ఇటు కార్తీక్ సుబ్బరాజు.. బంపర్ ఆఫర్ కొట్టేసిన వరుణ్ తేజ్
క్రేజీ కాంబోలో తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేస్తున్న వరుజ్ తేజ్(Varun Tej).
Varun Tej doing his next movie under Atlee and Karthik Subbaraj supervision.
- తమిళ దర్శకుడితో వరుణ్ తేజ్ కొత్త సినిమా
- భాగం కానున్న అట్లీ, కార్తీక్ సుబ్బరాజూ
- త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది
Varun Tej: మెగా ప్రిన్స్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. కంచె, ఫిదా, తొలిప్రేమ లాంటి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరో ఆ తరువాత ఎందుకో స్లో అయ్యాడు. అక్కడినుంచి మనోడు చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూ వచ్చాయి. మధ్యలో గుడ్లకొండ గణేష్ ఒకటి కాస్త పరవాలేదు అనిపించినా మళ్ళీ ప్లాప్ ట్రాక్ లోకి వెళ్ళిపోయాడు. గని, ఆపరేషన్ వాలంటైన్, గాండీవదారి అర్జున, మట్కా ఇలా ఒకదానికి మించి ఇంకోటి అన్నట్టుగా డిజాస్టర్స్ ఇస్తూ వచ్చాడు వరుణ్ తేజ్.
అందుకే ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న వరుణ్ తేజ్(Varun Tej) నెక్స్ట్ సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేపధ్యంలోనే వరుణ్ తేజ్ బంపర్ ఆఫర్ కొట్టేశాడట. ఒకేసారి తమిళ స్టార్స్ దర్శకుడు అట్లీ, కార్తీక్ సుబ్బరాజు లా సమక్షలో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఎలా అంటారా.. దర్శకుడు అట్లీ దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఇటీవల వరుణ్ తేజ్ కి ఒక కథను చెప్పాడట. చాలా సెన్సిబుల్ కంటెంట్ తో ఉన్న ఆ కథ విన్న వెంటనే చాలా ఇంప్రెస్ అయ్యాడట వరుణ్ తేజ్.
Actress Laya: సీనియర్ బ్యూటీ లయ.. చీరలో ఎంత అందంగా ఉందో చూడండి.. ఫొటోలు
అందుకే వెంటనే ఒకే చెప్పేశాడట. అయితే, ఆ కథను మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తన ప్రొడక్షన్ కంపెనీ అయిన స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ అండ్ ఒరిజినల్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. దీంతో వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఒకేసారి ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ సమక్షంలో తన నెక్స్ట్ సినిమాను చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు వరుణ్ తేజ్.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దర్శకుడు మేర్లపాక గాంధీతో కొరియన్ కనకరాజూ అనే సినిమా చేస్తున్నాడు. పక్కా హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో రరితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల అయిన వెంటనే కార్తీక్ సుబ్బరాజూ సినిమాను మొదలుపెట్టనున్నాడు వరుణ్ తేజ్. చూడాలి మరి ఈ రెండు సినిమాలు వరుణ్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తాయి అనేది.
