Prasanth Varma: PVCU లోకి కుమారస్వామి ఎంట్రీ.. సముద్రఖని దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్!

ప్రశాంత్ వర్మ(Prasanth Varma) కథతో PVCUలో సినిమా చేయనున్న నటుడు, దర్శకుడు సముద్రఖని.

prasanth varma and samuthirakani doing a movie in PVCU

  • ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో మరో వండర్
  • హనుమాన్ తర్వాత కుమారస్వామి మూవీ
  • సముద్రఖని దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్!

Prasanth Varma: వైవిధ్యమైన కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma), ‘అ!’ సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి ‘జాంబీ రెడ్డి’, ‘హనుమాన్’ వంటి చిత్రాలతో స్టార్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘జై హనుమాన్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU)ను సృష్టించి, భారతీయ పురాణాలను ఆధునిక సూపర్ హీరో కాన్సెప్టులతో జోడించి భారీ చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు.

Dhurandhar: ధురంధర్ లో ఓ పాత్ర కోసం 1300 మంది ఆడిషన్స్.. ఫైనల్ గా ఆమెను ఒకే చేశారట.. ఇంతకీ ఆ పాత్ర ఏంటో తెలుసా?

ఈ యూనివర్స్‌లో భాగంగా ఇప్పటికే పలు ప్రాజెక్టులు మొదలవగా, తాజాగా మరో ఆసక్తికరమైన సినిమా చేరడం విశేషం. కుమారస్వామి (మురుగన్) పురాణ నేపథ్యంతో ఒక భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా బాధ్యతలను విలక్షణ నటుడు, దర్శకుడు సముద్రఖనికి అప్పగించినట్టు సమాచారం. సముద్రఖని తనదైన శైలిలో ఈ కథను వెండితెరపై ఆవిష్కరించనున్నారని, ఇది యూనివర్స్‌లోనే ఒక విభిన్నమైన ప్రయత్నం కానుందని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈ సినిమా కథను కూడా స్వయంగా ప్రశాంత్ వర్మ అందిస్తుండటం విశేషం. ఇక కుమారస్వామి కథాంశం కావడంతో విజువల్స్, వీఎఫ్ఎక్స్ పరంగా ఈ సినిమా అత్యున్నత స్థాయిలో ఉండబోతోంది. ప్రశాంత్ వర్మ పర్యవేక్షణలో సముద్రఖని దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ కొత్త సినిమాతో ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ పరిధి మరింత పెరగడమే కాకుండా, ప్రేక్షకుల్లో అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి. భారతీయ ఇతిహాసాల స్ఫూర్తితో రాబోతున్న ఈ సినిమా యూనివర్స్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.