Dhurandhar: ధురంధర్ లో ఓ పాత్ర కోసం 1300 మంది ఆడిషన్స్.. ఫైనల్ గా ఆమెను ఒకే చేశారట.. ఇంతకీ ఆ పాత్ర ఏంటో తెలుసా?
ధురంధర్(Dhurandhar) సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంపిక కోసం జరిగిన ప్రాసెస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన కాస్టింగ్ డైరెక్టర్.
A staggering 1300 auditions were held for the female lead role in Dhurandhar movie
- ధురంధర్ లో హీరోయిన్ కోసం 1300 మంది ఆడిషన్స్
- చివరకు టీం లోకి వచ్చిన సారా అర్జున్
- ఆసక్తికర కామెంట్స్ చేసిన కాస్టింగ్ డైరెక్టర్
Dhurandhar: బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన ‘ధురంధర్(Dhurandhar)’ ఫ్రాంచైజీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. అత్యంత భారీ బడ్జెట్‌తో, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి భాగం ఏకంగా రూ.1400 కోట్ల రూపాయలు వసూలు చేయగా, రెండో భాగం రూ.1500 కోట్ల మార్కును దాటి ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ విజయంతో రణ్వీర్ సింగ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా రెట్టింపు అయ్యింది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక కోసం చిత్రబృందం పడిన కష్టం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రణ్వీర్ సింగ్ పక్కన హీరోయిన్ పాత్ర ఎంతో కీలకమైనది కావడంతో, తెరపై కొత్తగా కనిపించే యాక్ట్రెస్ కోసం టీమ్ తీవ్రంగా అన్వేషించారట. అందుకోసం ఏకంగా 1300 మందికి పైగా యువతులను ఆడిషన్స్ చేసినట్లు ‘ధురంధర్’ కాస్టింగ్ డైరెక్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. కథలో ఆ పాత్రకు ఉండాల్సిన ప్రత్యేకత, రణ్వీర్తో పండాల్సిన కెమిస్ట్రీ కోసం ఎక్కడా రాజీ పడకుండా ఇంత మందిని పరీక్షించినట్లు ఆయన పేర్కొన్నారు.
చాలా కాలం అన్వేషణ తర్వాత, చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్ను ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఫైనల్ చేశారట. ఆడిషన్స్‌లో ఆమె చూపిన ప్రతిభ, స్క్రీన్ ప్రెజెన్స్ మేకర్స్‌ను ఆకట్టుకోవడంతో 1300 మందిని కాదని ఆమెకు ఈ అవకాశం దక్కింది. రణ్వీర్ సింగ్ వంటి ఎనర్జిటిక్ స్టార్ పక్కన సారా అర్జున్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని, ఆమె నటన ఈ బ్లాక్ బస్టర్ విజయంలో కీలక పాత్ర పోషించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ న్యూస్ చూసిన నెటిజన్స్ సైతం అది సరైన ఎంపిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
