Adivi Sesh: నాలా పెద్ద సినిమాలు ఎప్పుడు చేస్తావ్ అన్నాడు.. నువ్వు నీ కుళ్ళు బుద్ది అనుకున్నాను.. ఇంతకీ ఎవరా హీరో?
తనను అవమానించిన పెద్ద హీరో గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన అడివి శేష్(Adivi Sesh).
Adivi Sesh shocking comments about a big star who humiliated him
- డెకాయిట్ ప్రమోషన్స్ లో అడివి శేష్
- పెద్ద హీరోతో చేదు అనుభవం
- సాలిడ్ కౌంటర్ ఇచ్చిన శేష్
Adivi Sesh: టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్. క్షణం, గూఢచారి, మేజర్ వంటి హిట్ చిత్రాలతో మినిమం గ్యారెంటీ హీరోగా ఎదిగిన ఆయన, ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ సరసన ‘డెకాయిట్’ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శేష్ ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు.
Trisha: ప్రేమ లేని జీవితం శూన్యం.. నా జీవితంలో కొత్త దశ మొదలయ్యింది.. త్రిష ఆసక్తికర పోస్ట్
తన కెరీర్ తొలినాళ్లలో ఒక పాపులర్ హీరో తనను తక్కువ చేసి మాట్లాడారని శేష్ గుర్తుచేసుకున్నారు. “నువ్వు ఎప్పుడూ ఇలాంటి చిన్న సినిమాలే చేస్తావా? నాలాంటి పెద్ద సినిమాలు ఎప్పుడు చేస్తావ్?” అని ఆ హీరో నేరుగా ప్రశ్నించినట్లు శేష్ తెలిపారు. ఆ మాటలకు ఒక్క క్షణం షాక్ తిన్న శేష్(Adivi Sesh), పైకి ఏమీ అనలేకపోయినా.. “నీ కుళ్లు బుద్ధి ఎప్పటికీ మారదు” అని మనసులోనే అనుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం ఆయన బయటపెట్టలేదు.
సినీ పరిశ్రమలో ఎదుగుతున్న సమయంలో ఇతరుల నుంచి ఎదురయ్యే ఇలాంటి హేళనలు తనను మరింత కష్టపడేలా చేశాయని శేష్ పేర్కొన్నారు. అప్పట్లో తనను విమర్శించిన వారు ఇప్పుడు తన సక్సెస్‌ను చూసి ఆశ్చర్యపోతుంటారని ఆయన పరోక్షంగా చురకలు అంటించారు. ప్రస్తుతం ‘డెకాయిట్’ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, శేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఆ కామెంట్స్ చేసిన హీరో ఎవరై ఉంటారా అనే చర్చకు దారితీస్తున్నాయి.
