Trisha: ప్రేమ లేని జీవితం శూన్యం.. నా జీవితంలో కొత్త దశ మొదలయ్యింది.. త్రిష ఆసక్తికర పోస్ట్
ప్రేమ అనేది సర్వస్వం కాకపోయినా, అది లేని జీవితం శూన్యం అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టిన త్రిష(Trisha).
Trisha gives a solid counter to the criticism against her
- త్రిష జీవితంలో కొత్త మలుపు
- ప్రేమపై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు
- లైఫ్ ఫిలాసఫీని పంచుకున్న స్టార్ హీరోయిన్
Trisha: చెన్నై బ్యూటీ త్రిష పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారాలపై వస్తున్న పుకార్లపై సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించారు. “ప్రేమ అనేది సర్వస్వం కాకపోయినా, అది లేని జీవితం శూన్యం” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జీవితంలో ఒక కొత్త దశలోకి ప్రవేశించానని, అనవసరమైన వాదనలకు తావులేకుండా ప్రశాంతంగా గడపడమే తన ప్రస్తుత లక్ష్యమని ఈ పోస్ట్‌ల ద్వారా స్పష్టం చేశారు త్రిష(Trisha).
Hrithik Roshan: నోరు మూయండి.. ‘రామాయణ’ ట్రోలింగ్ పై హృతిక్ స్ట్రాంగ్ కౌంటర్!
జీవితంలో మనశ్శాంతి కంటే మరేదీ విలువైనది కాదని, ఎదుటివారు ఏదైనా తప్పుగా చెప్పినా వారితో వాదించి గెలవాలనే ఆసక్తి తనకు లేదని, మౌనంగా ఉండటమే మేలని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరికీ వివరణలు ఇస్తూ మన శక్తిని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని, విమర్శలను పట్టించుకోకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగడమే నిజమైన ఎదుగుదలని లోతైన అర్థం వచ్చేలా వివరించారు.
మనం ఎప్పటికీ అందరినీ మెప్పించలేమని, మన రూపురేఖలు లేదా మాటలు నచ్చని వారు ఎప్పుడూ ఉంటారని త్రిష విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇతరుల ప్రవర్తనను మనం నియంత్రించలేమని, కేవలం మన జీవితాన్ని మనం నిజాయితీగా గడపడమే ముఖ్యమని ఆమె చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ మనం ఉత్తమంగా జీవించామన్న తృప్తితో నిద్రపోగలిగితే చాలని, విమర్శల కంటే ఆత్మసంతృప్తికే తాను ప్రాధాన్యత ఇస్తానని త్రిష స్పష్టం చేశారు. దీంతో త్రిష చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
