Hrithik Roshan: నోరు మూయండి.. ‘రామాయణ’ ట్రోలింగ్ పై హృతిక్ స్ట్రాంగ్ కౌంటర్!
'రామాయణ' మూవీ గ్రాఫిక్స్ పై జరుగుతున్న ట్రోలింగ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన హృతిక్ రోషన్(Hrithik Roshan).
hrithik roshan solid counter to ramayana trolling
- గ్లింప్స్ చూసి జడ్జ్ చేయకండి
- వందల కోట్ల రిస్క్, ఏళ్ల కష్టాన్ని గౌరవించండి
- రామాయణ’ టీమ్‌కు అండగా హృతిక్ రోషన్
Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ‘రామాయణ’ గ్లింప్స్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే, కొంతమంది ఈ గ్లింప్స్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆ కామెంట్స్ పై బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ గట్టిగా స్పందించారు. వీఎఫ్ఎక్స్ పై నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నవారికి కౌంటర్ ఇస్తూ, చిత్రబృందానికి తన పూర్తి మద్దతు ప్రకటించారు. కల్కి, బాహుబలి, క్రిష్ వంటి విజువల్ వండర్స్‌ను తెరకెక్కించే దర్శకులే నిజమైన హీరోలని, మునుపెన్నడూ లేని సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచాలనే వారి ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాలని ఆయన కోరారు.
సినిమా కోసం కోట్లాది రూపాయల బడ్జెట్, ఏళ్ల కష్టాన్ని పణంగా పెడుతున్న మేకర్స్ విజన్‌ను మనం గౌరవించాలని హృతిక్ అన్నారు. తమ కథకు ఎలాంటి విజువల్ స్టైల్ అవసరమో నిర్ణయించుకునే అధికారం పూర్తిగా ఆ చిత్రబృందానికే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం మనకు నచ్చలేదని వారి కష్టాన్ని తక్కువ చేసి చూడటం, విమర్శించడం ఏమాత్రం సరైన పద్ధతి కాదని హృతిక్ రోషన్(Hrithik Roshan) అభిప్రాయపడ్డారు.
ప్రతి సినిమా వెనుక ఒక ప్రత్యేకమైన విజన్ ఉంటుందని, పూర్తి సినిమాను వెండితెరపై చూడకుండా కేవలం ఒక గ్లింప్స్ ఆధారంగా ఒక నిర్ణయానికి రాకూడదని ఆయన ప్రేక్షకులను కోరారు. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్న సినిమాటోగ్రాఫర్లు, దర్శకుల ఆలోచనలను తప్పుబట్టడం కంటే, వారి ప్రయత్నాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం హృతిక్ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
