NTR31: తారక్‌తో ప్రశాంత్ సినిమా.. జోడీగా బాలీవుడ్ క్వీన్?
బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు తన తర్వాత సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టాడు.
- Naresh Mannam
- Published On : April 11, 2022 / 03:58 PM IST
Ntr31
NTR31: బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు తన తర్వాత సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ 30’ వర్కింగ్ టైటిల్ తో జూన్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోంది. కొరటాల సినిమా పూర్తైన వెంటనే ఎన్టీఆర్ ఏ సినిమా మొదలు పెట్టనున్నాడన్నది కూడా చాలా కాలంగా ఇంట్రెస్టింగ్ క్వచ్చిన్ గానే ఉంది.
NTR 31 : ‘సలార్’ రెండు పార్టులు! అందుకే బుచ్చిబాబు లైన్‌లోకి వచ్చాడా?
ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, బాలీవుడ్ దర్శకుడు సంజీయ్ లీలా భన్సాలీ, మరో తమిళ దర్శకుడితో పాటు కన్నడ దర్శకుడు, ‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇందులో ప్రశాంత్ నీల్ సినిమా ముందు పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా రాగా ఈ సినిమాపై తాజాగా ప్రశాంత్ నీల్ కూడా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
NTR30: తారక్ అక్కగా సోనాలీ రీఎంట్రీ!
కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సీక్రెట్ లీకైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా ఓ స్టార్ హీరోయిన్ నటించబోతోందట. ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణెను ఫైనల్ చేసినట్లు యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు, సినీ అనలిస్ట్ ఉమైర్ సంధు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ‘ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయబోతోంది. ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ నుండి ప్రారంభం కానుంది’ అని తెలుపుతూ ఉమైర్ సంధు ఎన్టీఆర్-దీపికాల ఫొటోలను షేర్ చేశారు.
NTR30: కొరటాలతో తారక్ సినిమా.. అసలు కథ ఇదేనా?
ఇది ఎంతవరకు నిజమన్నది తెలియదు కానీ.. ఒకవేళ ఇదే నిజమైతే, ప్రధాన తారాగణంలో దీపికా కూడా చేరితే… ఈ సినిమాపై ఉన్న హైప్ రెట్టింపు కావడం గ్యారంటీ. ప్రస్తుతానికి అయితే హిందీ సోషల్ మీడియాలో ఈ ఊహాగానాలు తెగ వైరల్ అవుతుండగా.. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, ప్రశాంత్ నీల్ విజువల్స్ తోడు దీపికా గ్లామర్ అండ్ యాక్టింగ్ కూడా తోడైతే మరో వండర్ ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి.
#JrNTR is SUPER HOT in India now. He will do Romance with Bollywood Queen #DeepikaPadukone in #NTR31 ! Shoot will start in December 🔥🔥🔥. pic.twitter.com/97oSzovcwb
— Umair Sandhu (@UmairSandu) April 10, 2022
