NTRNeel: మడగాస్కర్ నుంచి 500 మంది ఫైటర్స్.. కనీవినీ ఊహించని లెవల్లో యాక్షన్ సీన్స్.. వైరల్ అవుతున్న షూట్ పిక్స్
ఎన్టీఆర్ నీల్ (NTRNeel)సినిమాలో ఒక్క యాక్షన్ సీన్ కోసం మడగాస్కర్ నుంచి 500 మంది ఫైటర్స్ ను రప్పించిన దర్శకుడు ప్రశాంత్ నీల్.
- V Santhosh Kumar
- Published on- April 23, 2026 / 05:46 PM IST
Prashanth Neel brought 500 people from Madagascar for ntr Dragon movie action sequence
- భారీ లెవల్లో ఎన్టీఆర్ డ్రాగన్ యాక్షన్ సీన్స్
- మడగాస్కర్ నుంచి 500 మంది ఫైటర్స్
- ఇండియన్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం
NTRNeel: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న డ్రాగన్ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్, ‘కేజీఎఫ్’ సిరీస్‌తో ప్రశాంత్ నీల్ సృష్టించిన సంచలనం ఈ ప్రాజెక్టును ఇండియన్ సినిమాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా మార్చాయి. హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతోంది.
Sravanthi Chokkarapu: స్రవంతి ‘శారీ’ సెన్సేషన్.. క్రేజీ అందాలతో మతిపోగొడుతున్న యాంకర్
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా షూట్ చేస్తున్నారు. దీని కోసం ఏకంగా మడగాస్కర్ నుంచి 500 మందికి పైగా ఫైటర్లను, సభ్యులను ప్రత్యేకంగా తీసుకురావడం విశేషం. ఒక భారీ సెట్‌లో జరుగుతున్న ఈ చిత్రీకరణలో నెక్స్ట్ లెవల్ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ లుక్ చూస్తే అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని, ఆయన మాస్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నాయి.
భారతీయ సినీ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా, ఇకపై రాబోని విధంగా ఈ ఫైట్ సీక్వెన్స్‌ను ప్రశాంత్ నీల్ డిజైన్ చేశారట. దీని స్కేల్, ఇంటెన్సిటీ, ఎగ్జిక్యూషన్ అన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండబోతున్నాయని టాక్. సినిమా విడుదలైన తర్వాత “ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు రాలేదు.. ఇక మళ్ళీ రావడం కష్టం” అని ప్రతి ఒక్కరూ అనుకునేలా ఈ సీన్ ఉండబోతోందని సమాచారం. ఈ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసమే మేకర్స్ ఏకంగా రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. తారక్, నీల్(NTRNeel) కలిసి సృష్టిస్తున్న ఈ విధ్వంసం వెండితెరపై ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
