Preity Mukhundhan : అల్లు అర్జున్ ‘రాకా’ సినిమాను వదిలేసుకొని బ్లాస్ట్ బ్యూటీ..

దర్శకుడు అట్లీ హీరోయిన్ ప్రీతీ ముకుందన్ రాకా సినిమా ఛాన్స్ వదులుకుంది తెలిపాడు. (Preity Mukhundhan)

  • Updated on- July 8, 2026 / 12:59 PM IST

Preity Mukhundhan

Preity Mukhundhan : అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ రాకా సినిమా భారీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకోన్ మెయిన్ హీరోయిన్ గా ప్రకటించగా మరో నలుగురు హీరోయిన్స్ ఉంటారని వార్తలు వచ్చాయి. అందులో మలయాళ నటి ఫెమినా జార్జ్ ఉందని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తాజాగా దర్శకుడు అట్లీ హీరోయిన్ ప్రీతీ ముకుందన్ రాకా సినిమా ఛాన్స్ వదులుకుంది తెలిపాడు.

ఓం భీం బుష్ తెలుగు సినిమాతో నటిగా మారిన ప్రీతీ ముకుందన్ కన్నప్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవల సర్వం మాయ, బ్లాస్ట్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. ఇప్పుడు ఇదయం మురళి అనే తమిళ సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి అట్లీ గెస్ట్ గా హాజరయ్యాడు.

Also Read : Tabaahi Song : బాబోయ్.. టాక్సిక్ నుంచి బోల్డ్ సాంగ్ రిలీజ్.. యశ్, కియారా అద్వానీ రొమాన్స్ పీక్స్..

అట్లీ ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. నేను ప్రీతి ముకుందన్ నటనకు అభిమానిని. నా డ్రీమ్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ రాకా సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఆమెని అడిగాను. కానీ ఆమె బిజీగా ఉండటంతో మాకు డేట్స్ ఇవ్వలేకపోయింది. ప్రీతీ రాకా ఛాన్స్ మిస్ చేసుకుంది. ఆ పాత్ర ఫెమినా జార్జ్‌కు వెళ్ళిపోయింది అని అన్నారు. దీంతో రాకా సినిమాలో ఆ పాత్ర ఏంటి అనే ఆసక్తి నెలకొంది.