Santosh Sobhan : నా మ్యారేజ్ మాత్రం అలానే చేసుకుంటా.. పెళ్లి పై సంతోష్ శోభన్ కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ తన పెళ్లి పై కీలక వ్యాఖ్యలు చేశాడు. తన మ్యారేజ్ మాత్రం అలానే చేసుకుంటా అంటూ..
- gum 95921
- Published On : August 17, 2023 / 04:35 PM IST
Prem Kumar star Santosh Sobhan said he goes to register marriage
Santosh Sobhan : టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్ చేసిన శోభన్.. ఇప్పుడు మరో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసేశాడు. ‘ప్రేమ్‌కుమార్’ (Prem Kumar) అనే కామెడీ ఎంటర్టైనర్ తో ఈసారి ఆడియన్స్ ని అలరించబోతున్నాడు. ఈ చిత్రం పెళ్లి నేపథ్యంతో తెరకెక్కింది. ఏడాది క్రితమే ఈ మూవీ షూటింగ్ పూర్తీ అయినప్పటికీ అనేక కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.
Nayanthara : షారుక్ ఖాన్ కోసం మనసు మార్చుకున్న నయన్..? ఏ విషయంలోనంటే..?
తాజాగా ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసి రేపు ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు వెల్లడించారు. దీంతో సంతోష్ శోభన్ మరియు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ఆగష్టు 17న మీడియా విలేఖరాలతో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈక్రమంలో శోభన్ ని పెళ్లి ఎప్పుడని, ఎలా చేసుకుంటారని ప్రశ్నించగా.. “పెళ్లి చేసుకుంటాను. అయితే రిజిస్టర్ మ్యారేజ్ పద్దతిలోనే చేసుకుంటాను” అని చెప్పుకొచ్చాడు. కాగా రీసెంట్ గా తాను నటించిన సినిమాలు అన్ని పెళ్లి నేపథ్యంతోనే వచ్చాయని, ఇకపై పెళ్లి పై సినిమాలు చేయనని వెల్లడించాడు.
Syed Sohel : నా సినిమా కెరీర్‌లో ఆ సీన్స్ మాత్రం చేయను.. సోహైల్ శపథం దేని గురించి..?
ఇక ఈ ప్రేమ్‌కుమార్ షూటింగ్ టైంలో ధోతి పై పరిగెడుతుండగా శోభన్ పడిపోయి గాయాలు అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమాని కొత్త దర్శకుడు అభిషేక్ మహర్షి తెరకెక్కించాడు. రాశి సింగ్ శోభన్ కి జంటగా నటించింది. అనంత్ శ్రీకర్ సంగీతం అందించాడు. మూవీ కథ విషయానికి వస్తే.. హీరో పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోతుంటాయి. విసిగిపోయిన అతడు ఓ డిటెక్టివ్ ఏజెన్సీ పెడుతాడు. తరువాత ఏం జరిగింది..? బిజినెస్ క్లిక్ అయ్యిందా..? పెళ్లి చేసుకున్నాడా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
