Premane Oorilo : ‘ప్రేమనే ఊరిలో’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్..

శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు కీల‌క పాత్రాల్లో న‌టిస్తున్న చిత్రం ప్రేమనే ఊరిలో(Premane Oorilo).

Premane Oorilo song launch event

Premane Oorilo : శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు కీల‌క పాత్రాల్లో న‌టిస్తున్న చిత్రం ప్రేమనే ఊరిలో. మనోజ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఈ క్ర‌మంలో నేడు ఈ చిత్రంలోని మ‌రో పాట‌ను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ ‘‘ప్రేమనే ఊరిలో’ అనే టైటిలే చాలా బాగుందని, పాట అద్భుతంగా ఉంద‌ని చెప్పింది. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించాల‌ని, అంద‌రికి పేరు తీసుకుని రావాల‌ని ఆకాక్షిస్తున్న‌ట్లు చెప్పింది.

Singer Mangli : ఫ్రాన్స్‌లో సింగ‌ర్ మంగ్లీ.. తొలి చూపులోనే ప్రేమంటూ ఫోటోలు..

చందు శ్రీనివాస్ మాట్లాడుతూ .. ఈ చిత్రంతోనే నిర్మాతగా అడుగు పెడుతున్నానని అన్నారు. చిన్నతనం నుంచీ సినిమాలంటే ఇష్టమ‌ని, ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్న‌ట్లు తెలిపారు. ఈ చిత్రం చాలా బాగా వ‌చ్చిందని, ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ .. తాను గతంలో చేసిన ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’ రేంజ్‌లో ‘ప్రేమనే ఊరిలో’ ఉంటుంద‌న్నారు. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్నారు. రూపాయి పెడితే ఐదు రూపాయల లాభం తీసుకు వచ్చే సినిమా అవుతుందన్నారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ చిత్రం కోసం హైదరాబాద్‌కి రావడం ఆనందంగా ఉంది. ఇక్కడి ప్రేక్షకులు అంతులేని ప్రేమను చూపిస్తారు. నాకు కన్నడ ఇండస్ట్రీతో పాటుగా తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. ‘ప్రేమనే ఊరిలో’ సోల్ ఫుల్, ఎమోషనల్, మ్యూజికల్ లవ్ స్టోరీ. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందన్నారు.