×
Ad

Akhanda 2: ప్రధాని మోదీ ‘అఖండ 2’ చూడబోతున్నారు.. ఢిల్లీలో స్పెషల్‌ షో..

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ 2(Akhanda 2). డిసెంబర్ 12న విడువులైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Prime Minister Narendra Modi watching akhanda 2 special show

Akhanda 2: టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ 2(Akhanda 2). డిసెంబర్ 12న విడువులైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో తాజాగా అఖండ 2 సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ప్రధాని మోదీ అఖండ 2 స్పెషల్‌ షో చుడనున్నట్టు ప్రకటించాడు.‘‘ భారతదేశం అనేది ధర్మానికి గ్రంథాలయం లాంటిది. ధర్మానికి తల్లి వేరులాంటిది. ఆ ధర్మాన్ని నమ్మిన దేశాలు ఒకలా ఉంటే, నమ్మని దేశాలు మరోలా ఉన్నాయి. మనిషి తలుచుకుంటే గెలవవచ్చు.. ఓడిపోవచ్చు. కానీ, దేవుడు అనుకుంటే గెలుపు మాత్రమే ఉంటుంది. దానికి నిదర్శనం ఈ సినిమా విజయమే.

Payal Radhakrishna: పాయల్ పాప పరువాల విందు.. చూస్తే మతిపోవడం ఖాయం.. ఫోటోలు

ఇది ఆ దేవుడి సంకల్పం. దానిని మీరు అద్భుతంగా ఆదరిస్తున్నారు, ఆదరించారు కూడా. ఇంతటి విజయానికి కారణమైన ప్రేక్షకులు ప్రతీఒక్కరికి నా ధన్యవాదాలు. అఖండ 2ను 3డీలో చేయడం కొత్త అనుభూతి. మా తమన్‌ చెప్పినట్లు అందరు బాగుండాలి. తెలుగు సినీ పరిశ్రమ ఒక వేదికపైకి రావాలి. త్వరలో ప్రధాని మోడీ కోసం దిల్లీలో అఖండ 2 ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం” అటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.