×
Ad

Prithviraj Sukumaran : స్టార్ హీరోకు షూటింగ్‌లో ప్రమాదం.. మూడు నెలలు బెడ్ రెస్ట్.. సలార్ లేట్ అవుతుందా?

తాజాగా పృథ్వీరాజ్ ఓ సినిమా షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. పృథ్వీరాజ్ హీరోగా మళయాలంలో విలాయత్ బుద్ధ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

  • Published On : June 26, 2023 / 11:40 AM IST

Prithviraj Sukumaran injured in Movie shooting doctors said 3 months bed rest

Prithviraj Sukumaran  :  మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఓ పక్క మలయాళంలో వరుస సినిమాలు చేస్తూనే వేరే భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నారు. హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నాడు పృథ్వీరాజ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న సలార్ సినిమాలో పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నాడు.

తాజాగా పృథ్వీరాజ్ ఓ సినిమా షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. పృథ్వీరాజ్ హీరోగా మళయాలంలో విలాయత్ బుద్ధ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కేరళ ఆర్టీసీ బస్సులో భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుంటే పృథ్వీరాజ్ బస్సులో నుంచి జారీ కింద పడ్డారు. ఈ ఘటనలో పృథ్వీరాజ్ కాలికి తీవ్ర గాయమైంది. మరయూర్ బస్టాప్ లో ఈ ప్రమాదం చోటు చేసుకోగా వెంటనే స్పందించిన చిత్రయూనిట్ పృథ్వీరాజ్ ను హాస్పిటల్ కి తరలించారు.

Ram Charan : వామ్మో.. కోటి రూపాయల వాచ్.. వైరల్ అవుతున్న రామ్ చరణ్ వాచ్.. అసలు ధర ఎంతో తెలుసా?

పృథ్వీరాజ్ కాలికి సర్జరీ చేయాలని డాక్టర్లు తెలిపినట్టు సమాచారం. నేడు పృథ్వీరాజ్ కు సర్జరీ చేయనున్నారు. ఈ సర్జరీ వల్ల పృథ్వీరాజ్ మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందని డాక్టర్లు తెలిపారట. దీంతో ఆ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. అయితే పృథ్వీరాజ్ కి ఈ ప్రమాదం జరగడంతో ప్రభాస్ అభిమానులు కంగారు పడుతున్నారు. సలార్ సినిమాలో పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం సలార్ షూటింగ్ దశలోనే ఉంది. మరి పృథ్వీరాజ్ పోర్షన్ పూర్తయిందా లేదా అనేది సమాచారం లేదు. ఒకవేళ పృథ్వీరాజ్ షూటింగ్ పూర్తయితే ఓకే, లేకపోతే సలార్ సినిమా కూడా మరింత లేట్ అవుతుందని ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరి దీనిపై సలార్ చిత్రయూనిట్ స్పందిస్తుందేమో చూడాలి.