Bhamakalapam Trailer : అనుపమ.. ‘ఘుమ ఘుమ’.. ఒక్క ఎగ్ 200 ల కోట్లా!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన ప్రియమణి ‘భామా కలాపం’ ట్రైలర్‌కి సూపర్బ్ రెస్పాన్స్..
- sekhar
- Published on- January 31, 2022 / 09:01 PM IST
Bhamakalapam Trailer
Bhamakalapam Trailer: ప్రతి వారం ఓ సరికొత్త సినిమాను ఆడియన్స్ అందిస్తున్న ‘ఆహా’ ఫిబ్రవరి 11న మరో క్రేజీ మూవీ తీసుకొస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ ప్రియమణి మెయిన్ లీడ్‌గా.. డైరెక్టర్ భరత్ కమ్మ (డియర్ కామ్రేడ్) సమర్పణలో, అభిమన్యు దర్శకత్వంలో, SVCC Digital బ్యానర్ మీద భోగవల్లి బాపినీడు, ఈదర సుధీర్ నిర్మిస్తున్న ఫిలిం.. ‘భామా కలాపం’ (A Delicious Home Cooked Thriller)..
Bhama Kalapaam : ‘అనుపమ’.. చాలా డేంజరస్ హౌస్ వైఫ్..
ఇటీవల రిలీజ్ టీజర్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో పాటు మూవీ మీద హైప్ క్రియేట్ చేసింది. సోమవారం సాయంత్రం ‘భామా కలాపం’ ట్రైలర్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ఓ రెండొందల కోట్ల విలువ చేసే ఎగ్ చుట్టూ తిరిగే కథ ఇదని రివీల్ చేశారు.
అనుక్షణం ఉత్కంఠతకు గురిచేస్తూ, ఎన్నో ట్విస్టులతో ఆడియన్స్‌ను థ్రిల్‌కి గురిచేసే ఫిల్మ్ అనిపిస్తుంది. విజువల్స్, ఆర్ఆర్ హైలెట్ అయ్యాయి. ఫిబ్రవరి 11 నుండి ‘ఆహా’ లో ‘భామా కలాపం’ స్ట్రీమింగ్ కానుంది. బ్లాక్‌బస్టర్ మూవీస్, అదిరిపోయే టాక్ షోస్, థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌తో మరే ఓటీటీ కూడా ఇవ్వలేని ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’.
