Varanasi : ప్రియాంక చోప్రా బ‌ర్త్‌డే.. వార‌ణాసి నుంచి బిగ్ స‌ర్‌ప్రైజ్‌..

ప్రియాంక చోప్రా బ‌ర్త్ డే సంద‌ర్భంగా వార‌ణాసి (Varanasi )చిత్రం నుంచి బిగ్ స‌ర్‌ప్రైజ్ వ‌చ్చింది.

Priyanka Chopra birthday Mandakini look release from Varanasi

Varanasi : మ‌హేశ్‌బాబు న‌టిస్తున్న తాజా చిత్రం వార‌ణాసి. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఆమె మందాకిని పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది. ఇక నేడు (జూలై 18) ప్రియాంక పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. సెట్‌లోని ఫోటోల‌ను విడుద‌ల చేశారు రాజ‌మౌళి.

ఈ ఫోటోల‌కు ఆమె న‌వ్వితే అందం, న‌వ్వ‌క‌పోతే నిప్పు క‌ణిక అనే క్యాప్ష‌న్‌ను జోడించాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక మా ఒకే ఒక్క మందాకినికి హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ మ‌హేశ్ బాబు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Vishnu Priya : అల్ట్రా స్టైలిష్ లుక్‌లో విష్ణు ప్రియ‌.. ఫోటోలు వైర‌ల్‌..

ఈ మూవీలో రుద్ర‌, శ్రీరాముడిగా మ‌హేశ్ బాబు ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ప్ర‌పంచంతో పాటు కాలాన్ని చుట్టేసే సాహ‌సికుడి క‌థగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Sravanthi Chokarapu : తెల్ల‌చీర‌, మ‌ల్లెపూలతో మ‌తిపోగొడుతున్న తెలుగు అందం.. యాంక‌ర్ స్ర‌వంతి ఫోటోలు వైర‌ల్‌..