Priyanka Chopra: దేశం వేరైతే విడిపోవాలా.. అసలు ఎం మాట్లాడుతున్నారు.. రూమర్స్ పై ఆవేదన వ్యక్తం చేసిన ప్రియాంక
తన వ్యక్తిగత విషయాలపై వస్తున్న రూమర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన ప్రియాంక చోప్రా(Priyanka Chopra).
- V Santhosh Kumar
- Published On : March 26, 2026 / 08:37 AM IST
Priyanka Chopra emotional comments regarding the rumors circulating about her.
- నిక్- ప్రియాంక విడిపోతున్నారు అంటూ వార్తలు
- దేశం, మతం వేరైతే విడిపోవాలా అంటూ ప్రశ్న
- లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్
Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా నిక్ జోనాస్‌తో ఆమె విడాకులు తీసుకోబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. తమ మధ్య ఉన్న దేశం, మతం, వయసు వ్యత్యాసాల కారణంగానే కొందరు ఇలాంటి అసత్యాలను సృష్టిస్తున్నారని, కానీ ఎనిమిదేళ్లుగా తాము ఎంతో అన్యోన్యంగా ఉంటున్నామని ఆమె స్పష్టం చేశారు. కేవలం ఆరు నెలల పరిచయంతోనే పెళ్లి చేసుకున్నప్పటికీ, నిక్‌లో ఉన్న నిజాయతీ తమ బంధాన్ని బలోపేతం చేసిందని, ఇతరుల అభిప్రాయాలతో తమకు సంబంధం లేదని ప్రియాంక తేల్చి చెప్పారు.
Rangeela: వారసుడి కోసం వర్మ సాహసం.. ‘రంగీలా’ రీమేక్‌తో బాక్సాఫీస్ వద్ద పాత ఫామ్ అందుకుంటారా?
కుటుంబ భద్రత, ముఖ్యంగా తన కుమార్తె మాల్తీ మేరీ ప్రైవసీ విషయంలో ప్రియాంక అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారు. సెలబ్రిటీ హోదా వల్ల సాధారణంగా పార్కులకు వెళ్లినా, డిన్నర్లకి వెళ్లినా సెల్‌ఫోన్లతో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తనతో నేరుగా మాట్లాడే వారిని తాను గౌరవిస్తానని, కానీ అనుమతి లేకుండా ఫొటోలు తీయడం నచ్చదని పేర్కొన్నారు. అందుకే తన కుమార్తె భద్రత కోసమే సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నానని, తన వ్యక్తిగత రక్షణ కోసం కాదని ఆమె వివరణ ఇచ్చారు.
వృత్తిపరమైన విషయాల గురించి ఆమె వివరిస్తూ.. ఇష్టమైన పని చేస్తూ కుటుంబంతో సమయం గడపడమే నిజమైన విజయమని ఆమె అభివర్ణించారు. బాలీవుడ్‌లో అగ్ర నటిగా స్థిరపడిన తర్వాత, 30 ఏళ్ల వయసులో అన్నింటినీ వదులుకుని హాలీవుడ్‌లో అడుగుపెట్టడం ఒక పెద్ద సాహసమని, అక్కడ ఆరంభంలో మూస పాత్రలే వచ్చినప్పటికీ, పట్టుదలతో పోరాడి ఇప్పుడు తనకు నచ్చిన పాత్రలను ఎంచుకునే స్థాయికి చేరుకున్నానని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు. ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కొత్త సవాళ్లను స్వీకరించడమే తనను ఈ స్థితిలో నిలబెట్టిందని ఆమె ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రియాంక చేసిన ఈ కామెట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
